Home

»

Tv News

Karthika Deepam2 : జ్యోత్స్నకు కార్తీక్ షాకింగ్ పనిష్మెంట్.. జ్యూస్ స్టాల్‌లో పరువు పోయినట్లేనా?

Jun 2, 2026 10:46AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -685 లో.....జ్యోత్స్నని తీసుకొని కార్తీక్, సూరజ్ స్టాల్ దగ్గరికి వస్తాడు. పారిజాతం కూడా వస్తుంది. ఏంటే రానన్నావని పారిజాతం అడుగుతుంది. నేను ఓడిపోయే దాంట్లో కూడా మంచి వెతుక్కుంటానని జ్యోత్స్న అంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నావని పారిజాతం అంటుంది. ఆ తర్వాత కార్ దిగి జ్యోత్స్న స్టాల్ దగ్గరికి వెళ్తుంది. థాంక్స్ కార్తీక్ .. మేడమ్ ని తీసుకొని వచ్చినందుకని సూరజ్ చెప్తాడు. అక్కడ జ్యోత్స్న సారీ చెప్పున్నట్లున్న ఫ్లెక్సీ చూసి షాక్ అవుతుంది. మేడమ్ కి డ్రెస్ ఇవ్వండి అని కార్తీక్ అనగానే సూరజ్ డ్రెస్ ఇస్తాడు. జ్యోత్స్న ఇష్టం లేకపోయిన డ్రెస్ వేసుకుంటుంది.

మీరే స్వయంగా జ్యూస్ లు చేసి కస్టమర్స్ కి ఇవ్వాలని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న ఇష్టం లేకపోయిన జ్యూస్ లు చేస్తూ సర్వ్ చేస్తుంది. ఆ తర్వాత పారు మీ మనవరాలు జ్యూస్ చేస్తుంది.. మనం ఈ లోపు తాతకి కొన్ని ఫొటోస్ షేర్ చేద్దామని కార్తీక్ జ్యోత్స్న జ్యూస్ చేస్తున్న ఫొటోస్ ని తీసి శివన్నారాయణకి పంపిస్తాడు. ఆ ఫొటోస్ చూసి శివన్నారాయణ బాధపడతాడు. నా మనవరాలిని ఇలా చూడాలనుకున్నానా కానీ తప్పడం లేదని అంటాడు. ఆ అబ్బాయి ఎవరో సంస్కారమున్న అతని లాగా ఉన్నాడని సూరజ్ ని ఉద్దేశ్శించి కాంచన అంటుంది. మరొకవైపు జ్యోత్స్న పడుతున్న కష్టాన్ని పారు చుడలేక పాపం దానికి ఒక కూలర్ పెట్టించరా అని అంటుంది. ఏంటి పారు పార్టీ మార్చావా అని కార్తీక్ అనగానే అదేం లేదు రా అని పారు అంటుంది. ఆ తర్వాత అక్కడ జ్యోత్స్న సర్వ్ చేస్తున్నది సూరజ్ లైవ్ వీడియో పెడతాడు. అది జ్యోత్స్నకి తెలిసి కోప్పడుతుంది.

ఆ తర్వాత మీరు ఈ స్టాల్ ని ప్రమోట్ చెయ్యాలి.. అప్పుడు ఒక్క కస్టమర్ అయిన వస్తే మీకు ఈ బాధ ఉండదని కార్తీక్ అనగానే జ్యోత్స్న స్టాల్ గురించి గొప్పగా చెప్తుంది. అప్పుడే రంగా అనే కస్టమర్ వచ్చి జ్యోత్స్నని చూసి ఈ పనిపిల్ల ఫోటోస్ ని ముందు పెట్టారు ఏంటి అని అనగానే జ్యోత్స్నకి కోపం వస్తుంది. అతనికి జ్యూస్ అన్ని రకాల తొక్కలు కలిసి చేసి ఇస్తుంటే సూరజ్ కిందపడేస్తాడు. అతనికి మంచి జ్యూస్ చేసి ఇస్తాడు. అతను వెళ్ళిపోయాక మీరేం చేస్తున్నారు మేడమ్.. ఆ జ్యూస్ తాగి కస్టమర్ ఏమనేవాడు అని సూరజ్ కోప్పడతాడు. ఇక ఆ తర్వాత  జ్యోత్స్న కోపంగా అక్కడ నుంచి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com