
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. దాండియా స్పెషల్ థీమ్ తో ఈ ఎపిసోడ్ రాబోతోంది. "ఈ నవరాత్రుల్లో ఉండే సందడిని ఆ ఎంటర్టైన్మెంట్ ని మీకు అందించడానికి మేము జరిపిస్తున్నాము దాండియా స్పెషల్ ". అని చెప్పింది శ్రీముఖి. ఇక ఈ షోకి బాలు, యాష్మి గౌడ, శ్రవణ్, సమీరా భరద్వాజ్, నిఖిల్, మానస్, సుహాసిని, ప్రియాంక జైన్ వంటి వాళ్లంతా వచ్చారు.
ఐతే ఇంతలో బాలు వచ్చి శ్రీముఖి పక్కన నిలబడ్డాడు. అది చూసిన హరి ఒక కామెంట్ చేసాడు. "ఆయన ఎంత తెలివిగా నిల్చున్నాడో తెలుసా. ఈ మధ్యలో నిలుచుంటే ఏ బాధా ఉండదు కదా " అంటూ శ్రీముఖి , సమీరా భరద్వాజ్ మధ్యలో నిలబడిన బాలుని కామెంట్ చేసేసరికి శ్రీముఖి ఆహా అంటూ ఒక విషయాన్ని అడిగింది. "అసలు ఈ జోడి ఎప్పుడు మొదలైన జోడి" అంటూ బాలు-సమీరా భరద్వాజ్ ని అడిగింది.
వెంటనే సమీరా "ఇప్పుడు వెనక స్టేజి మీద ఫామ్ అయ్యింది" అని చెప్పింది. దాంతో శ్రీముఖి, బాలు షాకయ్యారు. "నువ్వు ఎప్పుడైనా దాండియా నైట్ కి వెళ్ళావా" అని శ్రీముఖి అడిగింది సమీరాని. వెంటనే సమీరా "నేను నైట్స్ అసలు బయటకు వెళ్ళను " అని చెప్పింది. దాంతో అందరూ నవ్వేశారు.
ఇక నెటిజన్స్ ఐతే బాలు - శ్రీముఖి, నిఖిల్ - యష్మి నైస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




.webp)

