Home

»

Tv News

Illu illalu pillalu : వల్లికి భద్రవతి వార్నింగ్.. సుకన్య సూసైడ్ డ్రామా!

Sep 9, 2026 9:15AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్  574 లో....తిరుపతి సుకన్యను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని భద్రవతికి చెప్పడంతో భద్రవతి కోపంతో రగిలిపోతుంది. దీని వెనుక వల్లి ఉందని అనుమానించి వల్లిని పిలిచి ఎడాపెడా వాయిస్తుంది. నా తమ్ముడికి అంత ధైర్యం లేదు.‌ వాడి వెనుక నువ్వే ఉన్నావు, తోక జాడిస్తే నీ రహస్యాలన్నీ బయటపెడతానని భద్రవతి వార్నింగ్ ఇస్తుంది. నేను మీకు భద్రురాలిని, ఇది మీ బ్లడ్ లోనే ఉంది.. మీ చెల్లెలు తిండిలేని మా మామయ్యని చేసుకుందంటూ వల్లి నటిస్తూ.. తిరుపతికి మీకు నచ్చిన సంబంధం చేసేయండి అని సలహా ఇస్తుంది.

 

భద్రవతి వార్నింగ్ తో కంగారుపడిన వల్లి భాగ్యం ఇంటికి వెళ్లి.. కొంపలు తగలబడుతుంటే మీకు వంటలా.. ఇక మన పప్పులు ఉడకవని అరుస్తుంది. సుకన్య, భాగ్యం మాత్రం.. తిరుపతి వాటా తీసుకుని సింగపూర్ లో సెటిల్ అవుదామని కలలు కంటుండటంతో అసలు విషయం చెప్తుంది. ఇక తిరుపతి వెంట పడితే భద్రవతి మన బతుకులు రోడ్డు మీద పడేస్తుందని వల్లి అనగానే, సుకన్య వెంటనే ప్లాన్ వేస్తుంది. తిరుపతికి..‌నువ్వు లేని జీవితం నాకు వద్దు బాయ్ అంటూ ఏడుస్తూ వాయిస్ నోట్ పెట్టి, ఇంట్లో డోర్ లాక్ చేసుకుని డమ్మీ ఉరితాడుతో సూసైడ్ డ్రామా మొదలుపెడుతుంది.

 

కంగారుగా వచ్చిన తిరుపతి.. సుక్కూ బయటకు రా అని బతిమలాడగా భద్రవతి వార్నింగ్ ఇచ్చింది.. అందుకే భయపడుతోందని వల్లి చెప్తుంది. దీంతో తిరుపతి.‌ ఈసారి మా వాళ్లు ఒప్పుకోకపోతే నిన్ను పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా ఇంటికే తీసుకెళ్తానని ప్రామిస్ చేయడంతో సుకన్య డోర్ తీసి బయటకు వస్తుంది. ప్లాన్ సక్సెస్ అయిందని వల్లి, భాగ్యం మురిసిపోతారు. మరోవైపు రామరాజు ఇంట్లో వల్లి.. ఈ ఇంటికి నేనే హీరోయిన్ అవుతానని కలలు కంటుండగా వేదవతి, నర్మద కలిసి నాటకం ఆడి వల్లి నోటి నుంచి నిజం రాబట్టాలని చూస్తారు. చివరకు అద్దంలో నర్మదను చూసిన వల్లి తప్పించుకుని.. రైస్ మిల్లు ఆరు లక్షలు పోయాయని చందు చెప్పాడంటూ మాట మార్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com