Home

»

Tv News

20 లక్షల సరికొత్త ఈవీ కార్ కొన్న నిరుపమ్!

Jul 1, 2026 12:26PM

నిరుపమ్ అనే పేరును మరిచిపోయి ఆడియన్స్ లో డాక్టర్ బాబు అనే పేరును ఫిక్స్ చేసిన సీరియల్ కార్తీక దీపం. ఇందులో వంటలక్క - డాక్టర్ బాబు ఫుల్ ఫేమస్. ఇప్పుడు కార్తీక దీపం 2 ప్రసారం అవుతోంది. నీరూపం ఎన్నో సీరియల్స్ లో నటించాడు. కొన్ని సీరియల్స్ ని ప్రొడ్యూస్ చేసాడు అలాగే ఎన్నో షోస్ కి కూడా మంజులతో కలిసి వస్తూ ఉంటాడు. కొన్ని మూవీస్ లో కూడా నటించాడు. ఒక ఇన్నోసెంట్ అబ్బాయిగా కుమారి శ్రీమతి అనే మూవీలో నిత్యామీనన్ తో కలిసి నటించాడు.

అలాంటి డాక్టర్ బాబు రీసెంట్ గా ఒక కార్ కొన్నాడు. ఈ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసాడు. మొర్రిస్ గరాజేస్ కి చెందిన ఎంజి కార్ ని ఈ జోడి. మై న్యూ కార్...ఎంజి విండ్సర్ ఈవి కార్ అని హాష్ టాగ్ కూడా పెట్టాడు. ఈ కార్ కాస్ట్ సుమారు రూ. 20 లక్షల పైమాటే. ఇక మంజుల కూడా నిరుపమ్ తో కలిసి కార్ దగ్గర నిలబడిన ఫొటోస్ ని షేర్ చేసింది. అలాగే షో రూమ్ లో కేక్ కట్ చేసి న్యూ కార్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

2006 లో చంద్రముఖి సీరియల్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నిరుపమ్.
అప్పటినుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా కార్తీక దీపం సీరియల్ వరకు వచ్చాడు. మూగమనసులు, అత్తారింటికి దారేది, రాధకు నీవెరా ప్రాణం, కలియుగ రామాయణం, గృహప్రవేశం వంటి ఎన్నో సీరియల్స్ లో నటించాడు. అలాగే తన సహచర నటి మంజులానే వివాహం చేసుకున్నాడు. కార్ కొన్న సందర్భంగా మిగతా నటులు చైత్ర రాయ్, ఆకర్ష్ బైరాముడి, కృతిక, కీర్తి-జైధనుష్, వీళ్లంతా కూడా కంగ్రాట్యులేషన్స్ అని మెసేజెస్ పెట్టారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com