Godhavari : జానూని అవమానించిన నందు.. ఆఫీస్ లో ఆమె గురించి నిజం తెలిసిపోతుందా!
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -150 లో....బతుకమ్మ వాయినాల దగ్గర జాను ఇచ్చిన వాయినం తీసుకోకుండా నందు విసిరికొట్టడంతో ఇంట్లో గొడవ మొదలైంది. బామ్మ, శారద నందును నిలదీయడంతో తోడబుట్టిన దాని సంతోషాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నావా అని అంటారు. దానికి నందు నా దగ్గర దాని బలుపు చూపిస్తుంది.. మాటిమాటికీ నన్నే చూస్తూ ఫోజులు కొడుతోంది.. నాతో డబ్బుంది నీతో లేదని కావాలని చూపిస్తుందంటూ కోపంగా అనేసి నందు వెళ్లిపోతుంది. గౌతమి ఫీజు అడిగినా ఇవ్వలేదంటూ జాను మీద ఆరోపణలు చేస్తుంది.
మరోవైపు నందు మాటలు తలచుకొని జాను బాధపడుతూ ఉండగా సంజయ్ బెడ్రూంలో ఫోన్ చూసుకుంటూ పట్టించుకోకుండా ఉంటాడు. పట్టించుకోవా నన్ను అంటూ జాను అడిగితే ఆ వాయినం నేను తీసుకోవాలా అంటూ సంజయ్ సెటైర్లు వేస్తాడు. తలనొప్పి అని సంజయ్ అనడంతో జాను కషాయం తెచ్చినా వద్దంటాడు. జాను పక్కన పెట్టి పడుకున్న తర్వాత చాటుగా కషాయం తాగేయడం చూసి జాను నవ్వుతుంది.దొంగచాటుగా తాగడం ఎందుకు అంటూ జాను సరదాగా అంటుంది.
మరోవైపు నందు వాళ్ల ఆఫీస్‌లో బాస్ యూఎస్ నుంచి వస్తున్నాడని, పేరు ఆకాష్ అని చెప్తారు. అబద్ధాలు చెప్పి జాబ్‌లో జాయిన్ అయిన వాళ్లు ఇప్పుడే మానేయండి, పెళ్లి కాలేదని చెప్పి జాయిన్ అయినా వదలరని మేనేజర్ వార్నింగ్ ఇవ్వడంతో నందు భయపడుతుంది. ఏదో మిస్ అయిందంటూ బామ్మ, తాతయ్యలు జాను, సంజయ్‌లను పిలిచి మీకు పెళ్లైంది, శోభనం కూడా అయిపోయింది కానీ సరదాగా షికారుకి వెళ్లి రండి అంటూ కారు ఎక్కిస్తారు. జాను, సంజయ్‌లు షికారుకి బయల్దేరతారు. ఇంట్లో నందు వదిలేసిన ఫైల్ చూసి గౌతమి, మురళీ ఆఫీస్‌కి తీసుకెళ్లేందుకు బయల్దేరతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
