.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి (Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-143 లో.. శివుడు, పార్వతీ, శేషు, రమణి, సంజు, జానూ అంతా రిసెప్షన్ కోసం ఏర్పాట్లు చేయాలని మాట్లాడుకుంటారు. మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ మా కోసం భరించు అమ్మ అని శివుడు అనగా జాను మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత జానూ, సంజు ఇద్దరు గొడవపడతారు. జాను పోస్టర్ చూస్తుంది. ఏంటి పోస్టర్ లో.. నీ పేరు కింద డిగ్రీలు రాసుకున్నావ్.. నా పేరు కింద ఏం రాయలేదని సీరియస్ అవుతుంది జాను. ఇప్పుడు మార్కర్ తో పెద్ద పెద్ద అక్షరాలతో బీఏ అని రాపించాలా అని సంజు అనగానే జాను మరింత కోప్పడుతుంది. ఆ తర్వాత ఇద్దరు కాసేపు గొడవపడతారు.
ఆ తర్వాత జానూ, సంజు ఇద్దరు రెడీ అవుతుంటారు. మరోవైపు మురళీ, ముసలమ్మ, కిన్నెర, గౌతమి అంతా కలిసి జాను రిసెప్షన్ కోసం వెళ్దామని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అంటారు. వద్దని, తన దారి తను చూసుకుంది. మనం ఎందుకు వెళ్ళాలని వాళ్ళ అమ్మ అనగానే మీరు వచ్చినా రాకున్నా నేను వెళ్తానే ఎందుకంటే పైన ఉన్న నా కొడుకు ఆత్మ నన్ను తిడుతుందని అంటుంది. ఆ తర్వాత కిన్నెర తనతో పాటు వస్తానని అంటుంది. గౌతమి కూడా వస్తానని అంటుంది. మీ అందరికి ఒక మగ తోడు కావాలి కదా నేను వస్తానని మురళి అంటాడు. ఆ తర్వాత ముసలమ్మ ఇండైరెక్ట్ గా మాట్లాడి జాను వాళ్ళ అమ్మని రిసెప్షన్ కి వచ్చేలా ప్లాన్ చేస్తుంది. దాంతో రిసెప్షన్ కి తను కూడా వస్తానని అంటుంది.
మరోవైపు జాను అందంగా రెడీ అవుతుంది. తనని చూసిన సంజు అలానే కన్నార్పకుండా చూస్తాడు. ఇక ఏంటి సంగతి అని జాను నిలదీయగా అప్పుడే అక్కడికి రమణి వస్తుంది . నువ్వు బాగున్నావని అంటున్నాడంటూ జానూతో రమణి అనగానే సంజు కవర్ చేస్తాడు. మరోవైపు సింహాద్రి కోసం శేషు ఎదురుచూస్తుంటాడు. ఏంటి ఇంకా రాలేదు. ఆ జానుని పంపించేస్తానని అన్నాడు. ఆస్తి మొత్తం నాకు వస్తుందని అనుకుంటాడు. ఇక సింహాద్రికి కాల్ చేస్తాడు శేషు. ఇంకా రాలేదంటని శేషు అనగా టైమ్ ఉందిగా అని సింహాద్రి అంటాడు. అందరు వచ్చాక వచ్చి జానుని కోలుకోకుండా చేసి ఇంట్లో నుండి గెంటేపిస్తానని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

