Home

»

Tv News

Godhavari : శంకర్ డైరీతో బయటపడ్డ అసలు నిజం.. సింహాద్రి గుట్టు విప్పనున్న జాను!

Jul 21, 2026 10:23AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -61 లో... మురళికి టిఫిన్ వడ్డీంచమని నందుకి శారద చెప్తుంది. దాంతో నందు కోపంగా వడ్డీస్తుంది. అమ్మ నా కాలేజీ అడ్మిషన్ కి యాభై వేలు కావాలని గౌతమి అంటుంది. అంత డబ్బు ఇప్పుడు మన దగ్గర లేదమ్మ అని శారద, జాను అంటారు. నాకు ఆ కాలేజీలోనే సీటు కావాలని గౌతమి అంటుంది. వాళ్ళు ఎందుకు చదవనిస్తారు. నాలాగే నీక్కూడా జాకెట్లు కుట్టేవాడిని ఇచ్చి పెళ్లి చేస్తారు.. అది కూడా ప్లాన్ ప్రకారం చేస్తారని నందు కోపంగా అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

గౌతమి అలిగి వెళ్తుంది. తనకి జాను నచ్చజెప్పుతుంది. అప్పుడే శంకర్ ఫ్రెండ్ ని తీసుకొని సూర్య వస్తాడు. అప్పుడే సింహాద్రి కూడా వస్తాడు. నేను శంకర్ ఫ్రెండ్ ని అమ్మ.. దుబాయ్ లో అతను నేను ఒకే రూమ్ లో ఉండేవాడిని.. అతను మర్చిపోయిన వస్తువులు తీసుకొని వచ్చాను.. అతను దుబాయ్ లో చాలా మందికి అప్పులు ఇచ్చాడు..  అది కూడా వడ్డీ లేకుండా ఇచ్చేవాడని అతను చెప్తాడు. మరి అలాంటి మా నాన్న ఇక్కడ అప్పులు చేసాడంటే అందులో ఏదో మోసం ఉందని జాను అంటుంది. శంకర్ ప్రతి రూపాయి ఈ డైరీలో రాసేవాడని అతను చెప్తాడు. అక్కడ కొంతమంది దగ్గర డబ్బు వసూలు చేసుకొని వచ్చానని అతను కొంతడబ్బు శారదకి ఇచ్చి వెళ్తాడు. ఒకరు వచ్చి అందరికి అప్పు ఇచ్చాడని అంటున్నారు.. ఇంకొకరు అప్పు చేసాడు అంటున్నారు.. ఎవరి మాటలు నమ్మాలని జానూ అనగానే ఏంటే ఇండైరెక్ట్ గా సింహాద్రి అన్నయ్యని అంటున్నావా అని శారద అనగానే ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే అంటున్నానని జాను అంటుంది. సింహాద్రి అదంతా చూస్తూ సైలెంట్ గా ఉంటాడు. గౌతమి ఫీజు కోసం డబ్బు తెచ్చానని సింహాద్రి అనగానే వద్దు అంకుల్ అని జాను అంటుంది. ఇప్పుడు ఆ అంకుల్ వచ్చి వెళ్ళాక ఒక క్లారిటీ వచ్చింది
. మా నాన్న ఎవరి దగ్గర అప్పు చేయ్యలేదని.. దీని వెనకాల ఏం ఉందని అంతా తేలుస్తానని జాను అంటుంది. ఇక సింహాద్రి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత జాను వెళ్లి డైరీ ఓపెన్ చేయబోతుంటే అప్పుడే శారద పిలుస్తుంది. దాంతో డైరి అక్కడ పెట్టేసి వెళ్తుంది. ఆ తర్వాత మురళి ఇక్కడ నీకేం లోటు లేదు కదా అని శారద అడుగుతుంది. ఆ తర్వాత మురళి షాప్ దగ్గరికి వెళ్తాడు. నందు బాక్స్ తీసుకొని వస్తుంది. మరొక వైపు శాంతి కూడా తీసుకొని వస్తుంది. అది గమనించి గొడవ అవుతుందని నందు లోపలికి వెళ్ళగానే మురళి కూడా వెళ్తాడు. ఇద్దరు వెళ్ళాక షాప్ క్లోజ్ చేస్తాడు తన అసిస్టెంట్. తరువాయి భాగంలో షాప్ లోపల ఏదో సౌండ్ వస్తుందని శాంతి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com