
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -11 లో....మురళితో మాట్లాడి శంకర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సింహాద్రికి తన బిజినెస్ పార్టనర్స్ వచ్చి శంకర్ తోట మాకు అమ్మమని చెప్తారు. మీరు అలా అడిగితే.. ఇక్కడ నుంచి వెళ్లొచ్చని వాళ్ళతో సింహద్రి అంటాడు. ఆ మాటలు శంకర్, జానూ, శారదా వింటారు. వాళ్ళని సింహాద్రి చూసి లోపలికి పిలుస్తాడు. సింహాద్రి పార్టనర్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
నీతో మాట్లాడడానికి వచ్చానురా.. నా కూతురు నందు మేనల్లుడిని పెళ్లి చేసుకోదంట అని శంకర్ చెప్తాడు. అదేంటి ఇన్ని రోజులుగా అనుకుందే కదా అని సింహాద్రి అంటాడు.. కానీ తనకి ఇష్టం లేకుండా ఏం చెయ్యలేం కదా అని శంకర్ అంటాడు. నువ్వే నీకు తెలిసిన NRI సంబంధం ఒకటి చూడురా అని సింహాద్రితో శంకర్ చెప్తాడు. అప్పుడే సింహాద్రి భార్య వచ్చి.. మొన్న ప్రసాదరావుగారు వాళ్ళ అబ్బాయికి సంబంధం చూడమని చెప్పారు కదా.. వాళ్ళు NRI కదా అని తను అంటుంది. సింహాద్రి అతనికి ఫోన్ చేసి విషయం చెప్తాడు. రేపు పెళ్లిచూపులకి వస్తామని వాళ్ళు చెప్తారు.ఆ విషయం శంకర్ కి చెప్తాడు సింహాద్రి. మరొకవైపు భువన చెప్పినట్లు బిజినెస్ చూసుకోవడానికి సూర్యని తుఫాన్ తీసుకొని వస్తాడు. అక్కడ రెసాట్ కి సూర్య వెళ్ళగానే అక్కడ ప్రాబ్లమ్స్ గురించి అందరు కంప్లైంట్ ఇస్తారు. దాంతో తుఫాన్ పై సూర్య కోప్పడతాడు. ఇక్కడకి అవసరం అయిన సామాను తీసుకొని వద్దామని తుఫాన్ ని తీసుకొని సూర్య బయల్దేరతారు.
మరొకవైపు శంకర్ ఇంటికి వస్తాడు. NRI సంబంధం చూసాను.. వాళ్ళు రేపు పెళ్లిచూపులకి వస్తున్నారని నందుతో శంకర్ చెప్తాడు. దాంతో నందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ రోజు నువ్వు హ్యాపీగా ఉన్నావంటే కారణం జానూ అని నందుతో శారదా అంటుంది. ఇక థాంక్స్ జానూ అని నందు చెప్తుంది. ఆ తర్వాత నందు తనకి మేకప్ కి అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి జానూని తీసుకొని వెళ్తుంది. అక్కడ జానూని సూర్య చూసి తన వెనకాలే వెళ్తాడు. షాప్ లో మేకప్ సామాను కొనుక్కుంటుంటే జానూని సూర్య ఆటపట్టిస్తాడు. అతన్ని చూసి నువ్వా అని జానూ కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






