
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -689 లో.....దీప దగ్గరికి మేనేజర్ వచ్చి చైర్మన్ గారు ఈ ఫైల్ ఇవ్వమని చెప్పారని అంటాడు. ఈ ఫైల్ అంతా ఇంగ్లీష్ లోనే ఉంది. ఒకసారి చదివి చెప్పండి అని దీప అనగానే.. నేను ఒకటి చెప్తే మిరొకటి అనుకుంటారు. నేను చదవనని మేనేజర్ అంటాడు పర్లేదు చదవండి అని దీప అంటుంది. దాంతో సరే అని ఇందులో మీరు స్టాఫ్ వేకెన్సీ కావాలని అడిగారు కదా.. అవసరం లేదని ఉందని చెప్తాడు. ఇతని మాటలు నమ్మేది ఎలా అని దీప ఆలోచిస్తుంది. దీపకి హెల్ప్ చెయ్యాలని కార్తీక్ అనుకొని అక్కడ క్లర్క్ ని పిలిచి నీకు ఇంగ్లీష్ చదవడం రాకపోతే ఫోన్ లో ఒక యాప్ ఉంటుంది. అందులో ఇంగ్లీష్ లో ఉన్నా ఫోటోని పెడితే అది తెలుగు లో ట్రాన్స్‌ఫర్ అవుతుందని కార్తీక్ చెప్తాడు.
దాంతో కార్తీక్ చెప్పినట్టు దీప చేస్తుంది. ఫైల్ ఇంగ్లీష్ లో ఉన్నది తెలుగు లో వస్తుంది. మేనేజర్ తనకి తప్పుగా చెప్పాడని అర్థం చేసుకొని మేనేజర్ పై కోప్పడుతుంది దీప. ఎందుకు ఇలా చేస్తున్నావ్.. ఎవరు నీతో ఇలా చేయిస్తున్నారని దీప అడుగుతుంది. అక్కడే ఉన్న జ్యోత్స్న..అదంతా విని వాడు ఎక్కడ తన పేరు చెప్తాడోనని టెన్షన్ పడుతుంది. వాడు తన పేరు చెప్పినట్లు.. దీప తన చెంప పగలకొట్టినట్లు ఉహించుకుంటుంది జ్యోత్స్న. మేనేజర్ మాత్రం జ్యోత్స్న పేరు చెప్పకుండా తప్పించుకుంటాడు. ఆ తర్వాత మీటింగ్ అని అందరిని శివన్నారాయణ పిలుస్తాడు. ఇప్పుడు రెండు రెస్టారెంట్ లు దీప, జ్యోత్స్నకి ఇచ్చాము కదా.. ఇప్పుడు వాటి గ్రోత్ దశరత్ చెప్తాడుని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్నకి అప్పగించిన రెస్టారెంట్ కొంచెం లాభాల్లోకి వచ్చింది. దీప రెస్టారెంట్ మైనస్ లోకి వెళ్ళిందని దశరథ్ చెప్తాడు.
దీప నీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పమని శివన్నారాయణ అడుగుతాడు. జ్యోత్స్న పక్కన హెల్ప్ చెయ్యడానికి కార్తీక్ గారు ఉన్నారు.. నాకు సపోర్ట్ గా ఒకరు కావాలని దీప చెప్తుంది. ఆ సపోర్ట్ ని నువ్వే వెతుక్కోవాలని జ్యోత్స్న కండిషన్ పెడుతుంది. ఆల్రెడీ వెతికానని దీప అంటుంది. అప్పుడే సూరజ్ చేతికి గాయంతో ఎంట్రీ ఇస్తాడు. నేను సూరజ్ ని తీసుకున్నానని దీప అంటుంది. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అంత చదువుకున్న సూరజ్ ... దీప దగ్గర పని చేస్తాడా.. ఒకవేళ చేసినా జీతం లక్షల్లో అడుగుతాడు.. ఇప్పుడు అంత ఇవ్వలేమని జ్యోత్స్న అంటుంది. నేను జీతంకి పని చెయ్యడం లేదు.. తన రెస్టారెంట్ లో నా స్టాలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందని సూరజ్ చెప్తాడు. మంచి ఆలోచన అని దీపని శివన్నారాయణ పొగుడుతాడు. ఆ తర్వాత సూరజ్, దీప తన సిస్టమ్ దగ్గరికి వెళ్లి వర్క్ స్టార్ట్ చేస్తారు. జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
