Home

»

Tv News

'మూడు బ్రేకప్పులు అయ్యాయి... చంపెయ్ లేదంటే తీసుకుపో' అని దేవుడిని అడిగా.!

Oct 2, 2026 5:26PM

సిల్వర్ స్క్రీన్ మీద ఎన్నో సపోర్టింగ్ రోల్స్ లో మెరిసింది సురేఖా వాణి. ఇప్పుడు ఆమె కూతురు సుప్రీతా అటు కొన్ని మూవీస్ లో ఇటు సోషల్ మీడియాలో, కవర్ సాంగ్స్ చేస్తూ, బుల్లితెర షోస్ లో కనిపిస్తూ ఉంది. అలాంటి సుప్రీతా తన లైఫ్ లోని ఎన్నో బాధాకరమైన విషయాలను ఒక టాక్ షోలో షేర్ చేసుకుంది. ఇప్పుడు ఆ ప్రోమో రిలీజ్ అయ్యింది.

"సుప్రీతా సింగల్ " అని అడిగిన ప్రశ్నకు "నేను కంప్లీట్ గా సింగల్ .. అబ్బాయిలు దొరకట్లేదు " అని చెప్పింది సుప్రీతా.  "ఐతే నేను మా అమ్మా వాళ్లకు చెప్పాను అబ్బాయిని వెతకండి గ్రిప్ లో పెట్టుకుంటాను " అంటూ చెప్పింది. " నీ లైఫ్ లో ఎప్పుడైనా బ్రేకప్ అయ్యిందా" అని హోస్ట్ అడిగేసరికి "యా అయ్యింది. మూడు బ్రేకప్స్ అయ్యాయి. సెకండ్ రిలేషన్ లో ఎలా ఐపోయాను అంటే నాకు పానిక్ అటాక్స్ రావడం మొదలయ్యాయి.

నేను ఇంకా మందులు వాడుతూ ఉంటాను. ఆ ట్రామా నా మూడో రిలేషన్ షిప్ కి వెళ్ళింది. ఆ దీపం వెలగలేదు. " అని చెప్పింది. "ఇప్పుడు ఉన్నవాళ్లకు బ్రేకప్స్ ఎందుకు అవుతున్నాయి " అన్న ప్రశ్నకు. "మొదట ఎవరికీ ఓర్పు లేదు. పోతే పోతుంది అనుకుంటున్నారు కానీ దాని వెనకాల చాలా బాధా ఉంటుంది"..

"చాలామంది అంటుంటారు సుప్రీతా సురేఖావాణికి మదర్ అని అలా ఉండడం తప్పా మీరేమనుకుంటున్నారు " అని అడిగింది హోస్ట్. "అలా ఉండడమే తప్పేమో. నేను టీన్స్ లోకి వచ్చేటప్పుడు మా అమ్మ చెప్పింది గుడ్ టచ్ బాడ్ టచ్ గురించి . మా అమ్మ వయసు 45 . మా అమ్మకు నాకు 20 ఏళ్ళ ఏజ్ గ్యాప్.  ఇంకా మా అమ్మ లైఫ్ ఎక్కడ చూసింది. అందుకే నాతో పాటు మా అమ్మకు కూడా ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నా" అంది. "మేము సెటిల్ ఇపోయాము అనే రూమర్ స్టార్ట్ అయ్యింది. కానీ మేమేమీ సెటిల్ అవ్వలేదు. మేము ఉండేది రెంట్ హౌస్.

"వాళ్ళు కూడా సింగల్ చైల్డ్ ని పెంచుతూ మా అమ్మను తిట్టేవాళ్ళు. కూతురిని వదిలేసింది అని. వాళ్ళ పిల్లలు ఇప్పుడు అలా చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు బయటికొచ్చి ఏడవడం మొదలుపెట్టారు. నాన్న చనిపోయినప్పుడు కర్మకాండలు నేనే చేసాను. దాన్ని పోస్ట్ చేస్తే పబ్లిసిటీ కోసం చేస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేశారు. అందుకే దేవుడిని అడుగుతున్నా నన్ను చంపెయ్ లేదంటే తీసుకుని వెళ్ళిపో ఇలాంటి బాదేందుకు నాకు అని " అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పింది సుప్రీతా.

 

 

[supreetha comments on breakups, surekha vani daughter supreetha, supreetha emotional]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com