
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2 (కార్తీక దీపం-2 ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-619 లో.. సుమిత్ర ఒక్కతే తన గదిలో ఉండగా దాహానికి నీళ్ళు తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే అప్పుడే దీప వచ్చి గ్లాస్ లో నీళ్ళు ఇస్తుంది. అవి తాగి సుమిత్ర మాములు అవుతుంది. ఏంటమ్మా నువ్వు హాస్పిటల్ లో ఉండాలి కదా ఇలా వచ్చావని అడుగగా..మీ కోసమే అని దీప అంటుంది. అప్పుడే జ్యోత్స్న, పారిజాతం ఎంట్రీ ఇస్తారు. నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉందా అని సుమిత్ర అడుగగా తనకి బిడ్డే భారంగా ఉందంట.. అందుకే వద్దనుకుంటుంసని జ్యోత్స్న అనగానే ఎందుకమ్మ అలాగా.. వినడానికి నాకే కష్టంగా ఉందని సుమిత్ర అంటుంది. అత్త నేను తర్వాత చెప్తానని కార్తీక్ అనగానే అత్తని కూడా ఇలాగే నోరు మూయించాడు మమ్మీ అని జ్యోత్స్న అంటుంది. అవన్నీ నీకు అవసరం లేదు జ్యోత్స్న అని కార్తీక్ అంటాడు. ఇక కార్తీక్, జ్యోత్స్నల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం, దీప, కార్తీక్ అందరు వెళ్తారు. సుమిత్రకి ఏదో చెప్పి కవర్ చేస్తాడు దశరథ్.
మరోవైపు శ్రీధర్, కాంచన మాట్లాడుకుంటారు. ఇంటికి వెళ్ళిపోదామా అని శ్రీధర్ అడుగుతాడు. మీరు వెళ్ళిపోండి అని కాంచన అంటుందిమ మరి నువ్వు అనగానే ఆ ఇంటికి వెళ్ళలేను.. ఈ ఇంట్లో ఉండలేను.. ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదని కాంచన అంటుంది. దీప చెప్పిన మాటలు తల్చుకొని కాంచన ఎమోషనల్ అవుతుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. అమ్మా అని కార్తీక్ అనగానే వాడిని నాతో మాట్లాడొద్దని చెప్పండి అని శ్రీధర్ తో కాంచన అంటుంది. నువ్వేం మాట్లాడకు నేను మాట్లడతాను చెప్పురా అని శ్రీధర్ అంటాడు. నేను ఇప్పుడు ఏం చెప్పలేనని కార్తీక్ అంటాడు. వాడు చెప్పడు అండి అని కాంచన ఎమోషనల్ అవుతుంటే.. బిడ్డని వద్దు అనుకున్నారంటే దాని వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది.. అదేంటో తెలుసుకుంటానని శ్రీధర్ అంటాడు.
మరోవైపు గుడి దగ్గరికి దశరథ్ వెళ్ళి పంతులు గారికి దీప జాతకం ఇస్తాడు. ఇది చూసి తన గురించి చెప్పండి అని దశరథ్ అడుగుతాడు. కొన్ని దైవ లిఖితాలు మనం చూడడానికే గానీ మార్చడానికి మనం సరిపోం అని పంతులు చెప్తాడు. దాంతో దశరథ్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఈ జాతకం ఉన్న వ్యక్తి చావు ముంగిట్లో ఉందని అంటాడు. ఈ గండాన్ని దాటే ఉపాయం లేదా గురువు గారు అని దశరథ్ అంటాడు. అనుభవించాల్సిందేనని పంతులు అంటాడు. తను ఏం పాపం చేసిందని దశరథ్ అంటాడు. పాప పుణ్యాల గురించి మనం చర్చించుకోలేం.. ఈ మనిషి రాబోయే ప్రమాదం నుండి తప్పించుకోలేదని పంతులు అనగానే దశరథ్ షాక్ అవుతాడు. సముద్రంలో చెలరేగిన తుఫాన్ లో చిక్కుకున్న నావ లాంటిదే ఈమె జాతకం. తుఫాన్ ని దాటుకొని తీరం చేరుతుందా.. గండాల సుడిగుండంలోనే మునిగిపోతుందా అని కాలమే నిర్ణయిస్తుంది..కానీ ప్రమాదం అయితే తప్పదు అని పంతులు చెప్తాడు. దాంతో దశరథ్ షాక్ అవుతాడు.అక్కడ నుండి వచ్చేస్తాడు. దీప, కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







