.webp)
బుల్లితెర మీద బాగా పాపులర్ ఐన సుధీర్ గురించి తెలియని వాళ్ళే ఉండరు. ఎవరన్నా సుధీర్ మీద జోక్స్ వేశారంటే మాత్రం ఇక నెటిజన్స్ వాళ్ళను ఆడేసుకుంటున్నాడు. సుధీర్ అటు టీవీ షోస్ లో హోస్ట్ చేస్తూనే ఇటు సిల్వర్ స్క్రీన్ మీద అవకాశం వచ్చినప్పుడల్లా హీరోగా తనను తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. అలాంటి సుధీర్ " సుధీర్ జోకర్ " అనే టైటిల్ తో ఒక మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రి మంకీస్, గాలోడు వంటి మూవీస్ తో ఒక మోస్తరు కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఐతే "గోట్ " అనే మూవీలో నటించాడు సుధీర్. ఐతే అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మాత్రం ఇంకా కంఫర్మ్ కాలేదు. ఇక ఇప్పుడు కొత్తగా ఈ మూవీని ఆయన పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో సుధీర్ మంచి స్టైలిష్ గ ఇంటరెస్టింగ్ గెటప్ లో కనిపించాడు. చేతిలో పేక పట్టుకుని నోట్లో సిగార్ తో కనిపించాడు. ఈ మూవీలో ఐషా హీరోయిన్‌గా బిగ్ స్క్రీన్‌కు పరిచయం కాబోతోంది. ఇక ఆమెతో పాటు అభిరామి, మురళి శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లంతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ డొంకాడ , శ్రీధర్ మక్కువ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు
ఇక త్వరలోనే ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. అదేవిధంగా అభిమానులతో ప్రత్యేక ఇంటరాక్షన్ సెషన్ కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో సుధీర్ జోకర్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది."సుధీర్ జోకర్ " ఫుల్ లెన్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సినిమా టైటిల్‌ను బట్టి ఇందులో కామెడీ , డ్రామా, మాస్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ సుడిగాలి సుధీర్ ఆన్‌స్క్రీన్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోతాయని అభిమానులు భావిస్తున్నారు.మూవీ స్టోరీ, రిలీజ్ అప్ డేట్స్ అన్నీ త్వరలో తెలియబోతున్నాయి. ఇప్పటికే రిలీజయిన టైటిల్ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.






