సుధీర్‌తో పెళ్లంటూ కావ్యకు లింకప్!
.webp)
బుల్లితెర మీద సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. ఐనా నెగటివ్ కామెంట్స్ ని పట్టించుకోడు పాజిటివ్ కామెంట్స్ ని కూడా పట్టించుకోడు. అసలు సోషల్ మీడియాలోనే పెద్దగా కనిపించడు. కానీ ఫాన్స్ మాత్రం జై సుధీర్ అని ఊగిపోతూ ఉంటారు. రీసెంట్ గా సుధీర్ కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఐపోయిందని ఆ అమ్మాయితో బ్రేకప్ అయ్యిందన్న వార్తలు హల్చల్ చేశాయి. కానీ సుధీర్ మాత్రం అస్సలు రెస్పాండ్ కాలేదు. అలాగే రష్మీ- సుధీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఇంకేముంది ఇద్దరూ త్వరలో పెళ్లి చేసేసుకుంటున్నారు అన్న న్యూస్ కూడా వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నారు. ఇక ఇప్పుడు సుధీర్ ని కావ్యతో లింక్ చేసి కామెంట్స్ పెడుతున్నారు. ఈ విషయాన్నీ చెఫ్ మంత్రా ప్రాజెక్ట్ కే కుకింగ్ షోలో చెప్పింది కావ్య.
ప్రాజెక్ట్ కే కుకింగ్ షో ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా సుధీర్ వచ్చాడు. షో లోకి రాగానే సుమా "ఎవరూ " అని అడిగింది. "నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ " అని చెప్పాడు. "ఎలా ఇచ్చారు నీకు ఈ జాబ్ " అని అడిగింది. "ఫుడ్ అంటే ఇష్టం ఆకలి గురించి సెట్ లో నాకన్నా బాగా ఎవరికీ తెలీదు " అని చెప్పాడు. తర్వాత కావ్య దగ్గరకు వెళ్లి పులిహోర కలిపాడు. ఆమె మానాన ఆమె శారీ వేసుకుని వచ్చి చక్కగా వంట చేసుకుంటూ ఉంటే "ఇలాంటి డ్రెస్సులు వేసుకుని వంటలు చేస్తేనే సెక్షన్ 140 ప్రకారం " అనేలోపు "మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది " అంటూ కావ్య అడిగింది. దాంతో సుధీర్ సిగ్గుపడిపోయాడు. "ఏమయ్యింది ఈ వేళా" అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అయ్యింది. ఇంతలో సుమ వచ్చి "అడుక్కునే ఫ్రెండ్సా " అని అడిగింది. వెంటనే "జిమ్ జిమ్ తారా " సాంగ్ ప్లే అయ్యింది. ఇక ఆనియన్స్ కట్ చేస్తూ ఉండగా కావ్య దగ్గరకు వచ్చి " ఉల్లిపాయలు కట్ చేయడం చాలా సింపుల్ అండి" అంటూ చెయ్యి పట్టుకుని మరీ కట్ చేయించాడు. ఇంతలో కావ్య కన్నీరొస్తుంది నాకు " అంది. "అయ్యయ్యో " అంటూ ఆమె ముఖం మీద పడిన ముంగురులని తీసి చెవి పక్కన సర్దాడు. వెంటనే అమరదీప్ వచ్చి కన్నీళ్లు వచ్చాయి చూడవా అన్నాడు.
తర్వాత సుమ "అందరూ మీ మీ లైఫ్ లో విన్న గాసిప్ ఏంటి " అని అడిగింది. వెంటనే కావ్య రియాక్ట్ అయ్యింది. "మీరు నేను పెళ్లి చేసుకుంటున్నాం " అని పెట్టారు అంటూ సుధీర్ కి చెప్పింది. "ఏముంది ఇంకా దీని మీద నాలుగైదు ఈవెంట్ లు వస్తాయి " అంది.




.webp)
