Home

»

Tv News

సుధీర్‌కు పెళ్లి సంబంధాలు.. ఫ్యామిలీ స్టార్స్‌లో జ్యోతక్క, సుజాతల హంగామా!

Oct 15, 2026 2:17PM

ఫామిలీ స్టార్స్ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో బతుకమ్మ స్పెషల్ వచ్చేసింది. ఈ షోకి జ్యోతక్క అండ్ ఫామిలీ అలాగే రాకింగ్ రాకేష్ అండ్ ఫామిలీ వచ్చారు. ఇక రాగానే జ్యోతక్క "నా తమ్ముడు వజ్రం " అంటే " నా తమ్ముడు 24 క్యారెట్ నల్లబంగారం " అంటూ చెప్పింది జోర్దార్ సుజాత. "అర్ధమవుతోంది ..అంటే పండక్కి బంగారం పెట్టమనేగా ఇద్దరూ చెప్తున్నారు " అంటూ సుధీర్ కూడా డైలాగ్ వేసాడు.

తర్వాత సుధీర్ గంగూలీ, రాకింగ్ రాకేష్ ఇద్దరి బావల దగ్గరకు వెళ్ళాడు. "బామ్మర్దికి ఒక సంబంధం తేవాలని లేదా" అని అడిగాడు. దాంతో గంగూలీ "మొన్ననే ఒక సంబంధం చూసా 6 తర్వాత అమ్మాయికి ఎం కనిపించదట . "మరి మీరేమన్నారు అని సుధీర్ అనేసరికి 6 తర్వాత మనోడు అసలు మాకు కూడా కనిపించడు " అని చెప్పా అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక సుధీర్ ని అష్షు రెడ్డికి ఇచ్చి చేయాలనీ మా మరదలు ఫిక్స్ అని జ్యోతక్క కాదు స్రవంతి మంచిగా ఉన్నది అని సుజాత పోటీ పడ్డారు. వెంటనే బావల దగ్గరకు వెళ్లి "ఎలా ఉంటున్నారు మీరు వీళ్ళతో అసలు" అని అడిగాడు సుధీర్. "10 రోజులయ్యింది ఇంటికి పొయ్యి. పక్క గల్లీలోనే ఒక హోటల్ లో గది తీసుకుని ఉంటున్నాం " అని చెప్పాడు రాకేష్. "మరి పెద్ద బావ " అని అడిగేసరికి "ముందు తీసుకుంది ఆయనే" అని చెప్పాడు రాకేష్.

తర్వాత ఎపిసోడ్ కి సీరియల్ నటులు డాలీ - కరం , కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాష్టర్ - వర్ష వచ్చారు. అలాగే మధు ప్రియా వచ్చి బతుకమ్మ పాటలు పాడి ఎంటర్టైన్ చేసింది. ఫైనల్ గా జ్యోతక్క వాళ్ళ అమ్మాయి వెన్నెలని, జోర్దార్ సుజాత వాళ్ళ అమ్మాయి ఖ్యాతికని బతుకమ్మలను తీసుకొచ్చారు. "నా మేనకోడళ్ళ బతుకమ్మలు రెడీ " అన్నాడు సుధీర్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com