
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 కంటెస్టెంట్ సుధీర్ రెడ్డి నేడు తన పుట్టినరోజును బిగ్ బాస్ హౌస్ లోనే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతని కుటుంబం సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ గా విష్ చేసింది సుధీర్ తన తల్లిదండ్రులతో దిగిన ఫోటోలు, వారి వీడియోను పోస్ట్ చేస్తూ "Happy Birthday Sudheer Reddy" అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ రీల్ కు ఇప్పటికే 17.9K లైక్స్, 300 కామెంట్స్ వచ్చాయి.
ఈ పోస్ట్ లో "నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా.. నీ స్పెషల్ డేని మేము ఎంతో ప్రేమతో, సంతోషంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నీ నిజాయితీ గల మనసు, స్వచ్ఛమైన ఆత్మ ఎంతో మంది మనసులను గెలుచుకుంది. ఈ పుట్టినరోజు నీకు అందమైన, మరపురాని జ్ఞాపకంగా మారాలని, నీ కలలన్నీ నెరవేరాలని, నీ చిరునవ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. స్ట్రాంగ్ గా ఉండు, నిజాయితీగా ఉండు, అందరి మనసులు గెలుస్తూనే ఉండు" అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు.
వీడియోలో సుధీర్ తల్లిదండ్రులు సోఫాలో కూర్చుని కొడుకుకు బర్త్ డే విషెస్ చెప్తున్నట్టు కనిపిస్తోంది. సుధీర్ తన పేరెంట్స్ తో కలిసి సంతోషంగా ఉన్న క్షణాలు ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉండటం వల్ల కొడుకు పుట్టినరోజును దగ్గర ఉండి జరుపుకోలేకపోయినా, దూరం నుంచే ప్రేమను పంచుతున్నామని వారు చెప్పడం ఫ్యాన్స్ ను ఎమోషనల్ చేస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లో సుధీర్ జెన్యూన్ గా ఆడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇలాంటి టైమ్ లో తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఈ బర్త్ డే విష్ అతనికి పెద్ద బూస్ట్ లాంటిది. బిగ్ బాస్ కూడా హౌస్ లోపల అతనికి సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. #sudheerreddy #biggbosstelugu10 అనే హ్యాష్ ట్యాగ్స్ తో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.





