.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 ఐదో వారం నామినేషన్స్ లో సుధీర్, రోహిత్ మధ్య జరిగిన వార్ హౌస్ మొత్తాన్ని షేక్ చేసింది. సుధీర్ రోహిత్ ని నామినేట్ చేస్తూ తన పాయింట్స్ చెప్పడం మొదలుపెట్టాడు. హోస్ట్ ఓ వీడియో చూపించారు..అందులో అతను టంగ్ స్లిప్ అయ్యాడు.. మర్యాద తప్పాడు అని అనిపిస్తోందని సుధీర్ తన నామినేషన్స్ పాయింట్స్ చెప్తుంటాడు. వెంటనే రోహిత్ లేచి "ఆ మాటలు ఏంటో కూడా చెప్పు" అని రోహిత్ అంటాడు. అది నీకే తెలియాలని సుధీర్ అనగా దీనికి రోహిత్ తనను తాను డిఫెండ్ చేసుకుంటూ "ఆ మాటలు నా నోటి వెంట ఎప్పుడు వచ్చాయో కూడా తెలీడం లేదు" అని రోహిత్ అంటాడు.
అప్పుడు సుధీర్ మరింత స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ "అవును.. ఎందుకంటే నీ బ్రెయిన్‌లో అన్ని ఉన్నాయ్.. చేతులతో ఇలా సైగ చేస్తుంటావ్ కదా.. అలా అంటే మేం ఏం చేయాలన్నట్టు.." అని సుధీర్ అడుగుతాడు. సుధీర్ పాయింట్లకు సెలెబ్రిటీ టీం అంతా నవ్వేస్తుంటుంది. రోహిత్ చేతులతో చేసే అసభ్య సైగలను సుధీర్ ఇలా బయటపెట్టడంతో హౌస్ లో నవ్వులు విరిశాయి. ఆ తర్వాత సుధీర్ మరో పాయింట్ లేవనెత్తుతూ "అసలు అలాంటి మాటలు నీ నోట్లోంచి ఎందుకు వస్తున్నాయ్.. అది నా ప్రశ్న" అని సుధీర్ అంటే.. "అది క్వశ్చన్ ఆ?" అని రోహిత్ ఎదురు ప్రశ్నిస్తాడు. "అవును.. సమాధానం చెప్తా అంటే చెప్పు" అని సుధీర్ అంటాడు.
ఇక్కడే సుధీర్ అదిరిపోయే పంచ్ వేశాడు, "పాడ్ కాస్ట్‌లోకి వచ్చావేమో" అని సుధీర్ అంటే.. సెలెబ్రిటీ టీం క్లాప్స్ కొడుతూ నవ్వుతూ ఉంటారు. రోహిత్ బూతులు, అసభ్య పదాలు వాడటాన్ని పాడ్ కాస్ట్ తో పోల్చడంతో హౌస్ దద్దరిల్లిపోయింది. దీనికి రోహిత్ కౌంటర్ ఇస్తూ "నువ్వు స్టాండప్ కామెడీ చేస్తున్నావ్" అని సుధీర్‌ను అంటాడు రోహిత్.చివరగా సుధీర్ తన నామినేషన్ ని ముగిస్తూ "నన్ను ఏ రోజు కూడా డోర్ తెరిచి బయటకు పో అని అనలేదు" అని సుధీర్ అంటాడు. ఆ మాటలకు సెలెబ్రిటీ టీం మరింతగా నవ్వుతుంది. సుధీర్ వేసిన ప్రతీ పాయింట్ కి సెలబ్రిటీ టీం క్లాప్స్ తో సపోర్ట్ చేయగా, రోహిత్ మాత్రం ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. ఈ నామినేషన్ తో రోహిత్ అసలు రంగు బయటపడిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.




.webp)
.webp)
