Home

»

Tv News

బిగ్ బాస్ విన్నర్ రోహిత్... మిథిలేష్ మనీతో సగం వాటా అడుగుతాను

Oct 9, 2026 6:23PM

బిగ్ బాస్ నుంచి సృష్టి వ్యాకరణం ఏలిమినేట్ ఐపోయాక చాలా ఇంటర్వ్యూస్ ఇస్తోంది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అన్న ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇచ్చేసింది. "రోహిత్, త్రిగున్ నా ఫ్రెండ్స్ . ఐతే రోహిత్ బిగ్ బాస్ విన్ అవుతాడు అనుకున్నా . త్రిగున్ కూడా మంచి కంటెండర్. అతను విన్ ఐనా కూడా నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఇక టాప్ 3 లో ఎవరు ఉంటారు అని నేను అనలైజ్ చేస్తే రోహిత్, త్రిగున్ కచ్చితంగా ఉంటారు అలాగే ఇంకొంచెం అనిపిస్తోంది ఏంటంటే రాంప్రసాద్ అన్న ఉంటాడనిపిస్తోంది. ఇక టాప్ 5 లో నా ఫ్రెండ్ షాలిని కూడా ఉంటుంది. నాకు మోడలింగ్ అంటే ఇష్టం. అలాగే కెమెరా అంటే కూడా ఇష్టం.

 కాలేజ్ లో ఉన్నప్పుడు నేను హైట్ గా ఉన్నాను కదా మోడలింగ్ చేస్తే బాగుంటుంది అని అందరూ అనేవాళ్ళు. చిన్న చిన్న ఫోటో షూట్స్ చూసుకునేదాన్ని. దాంతో నాలో తెలీని ఉత్సాహం వచ్చేది. ఫామిలీస్ లో ఈ మోడలింగ్ ని ప్రొఫెషన్ లెక్క చూడరు. శని, ఆది వారాల్లో ఫోటో షూట్స్ చేసుకోమని పేరెంట్స్ పర్మిషన్ ఇచ్చారు దాంతో చాలా హ్యాపీగా చూసుకునేదాన్ని. నెమ్మదిగా దాంట్లో కూడా నాకు గ్రోత్ వచ్చింది. మోడలింగ్ ని నేను ఎక్కడా నేర్చుకోలేదు. డైరెక్ట్ గా స్టేజి ఎక్కేసాను. మొదట్లో టామ్ బాయ్ లెక్క ఉండేదాన్ని. కానీ తర్వాత నన్ను నేను చేంజ్ చేసుకుంటూ వచ్చాను. పేరెంట్స్ కూడా నా ప్యాషన్ చూసి ఓకే చెప్పారు. మోడలింగ్ నా ఫస్ట్ జాబ్. నా శాలరీ అప్పుడు 2 వేలు. ఇక మిథిలేష్ గురించి చెప్పాలంటే స్మార్టస్ట్ మూవీ వేసాడు. బిగ్ బాస్ హిస్టరీ చూస్తే ఆ 15 లక్షలు ఎప్పుడు విన్నర్ కి దక్కలేదు. అది నా ఫ్రెండ్ తీసుకెళ్తానంటే నేనెందుకు వద్దంటాను. అందులో సగం నేను అడుగుతాను. హౌస్ లో అందరం చెప్పాం వద్దు వెళ్లొద్దు అని. కానీ అన్ని తెలిసి అతను వెళ్ళిపోతాను అంటే ఆపడానికి నేను ఎవరిని. చాల స్మార్ట్ గా ఆలోచిస్తాడు. " అని చెప్పింది సృష్టి.

సృష్టి సోషల్ మీడియాలో మంచి గ్లామర్ ఫోటో షూట్స్, డాన్స్ రీల్స్ తో బాగా వైరల్ అయ్యింది. అలాగే లైఫ్ స్టైల్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ముంబైలో మోడలింగ్ చేస్తూ తెలుగు ఆడియన్స్ కి బిగ్ బాస్ ద్వారా దగ్గరయింది.  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com