Home

»

Tv News

 శ్రిష్టి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Oct 6, 2026 12:09PM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో ఆదివారం నాటి ఎపిసోడ్ లో  నాలుగో  ఎలిమినేషన్ జరిగింది. మోడల్ శ్రిష్టి వ్యాకరణం హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. దాదాపు నెల రోజులు హౌస్ లో ఉన్న శ్రిష్టి తన బోల్డ్ ఒపీనియన్స్ తో, సుధీర్ తో గొడవతో బాగా హైలైట్ అయింది. అయితే ఓటింగ్ లో తక్కువ ఓట్లు రావడంతో నాగార్జున తనను ఎలిమినేట్ చేశాడు. శ్రిష్టి మొదట అగ్నిపరీక్ష 2 లో ప్రూవ్ చేసుకుని మెయిన్ హౌస్ కి వచ్చింది.

అయితే శ్రిష్టి ఎలిమినేషన్ తో పాటు ఆమె రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. రిపోర్ట్స్ ప్రకారం శ్రిష్టి కామనర్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వచ్చింది. కామనర్ లకు సెలబ్రిటీల కంటే తక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది.  రిపోర్ట్స్ ప్రకారం సృష్టికి వారానికి సుమారు రూ. 70,000 నుంచి రూ. 75,000 వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అంటే నాలుగు వారాలకు సృష్టికి సుమారు రూ. 3 లక్షల వరకు వచ్చినట్లు అంచనా. అంతేకాదు అగ్నిపరీక్షలో పాల్గొన్నందుకు అదనంగా రూ. 50,000 ఇచ్చినట్లు సమాచారం. దీంతో కలిపి మొత్తంగా సృష్టి బిగ్ బాస్ జర్నీ ద్వారా రూ. 3.5 లక్షల వరకు సంపాదించినట్లు టాక్ నడుస్తోంది. ఇది అధికారికంగా మేకర్స్ ప్రకటించలేదు, కేవలం ఇండస్ట్రీ సోర్సెస్ నుంచి వచ్చిన లీక్ మాత్రమే. 

మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే సృష్టి శ్రిష్టి రెమ్యునరేషన్ తక్కువే. హౌస్ లో ఆటో రామ్ ప్రసాద్ కు వారానికి రూ. 3.5 నుంచి 4.5 లక్షలు, ముకేశ్ గౌడకు రూ. 3 నుంచి 4 లక్షలు, వర్షిణికి రూ. 3 లక్షల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కామనర్లు అయిన శాలినీ, రోహిత్, అమన్, శ్రిష్టికి మాత్రం రూ. 70,000 చొప్పున ఇస్తున్నారని తెలుస్తోంది. శ్రిష్టి ఎలిమినేషన్ తర్వాత ఆమె ప్లేస్ లో ఎవరైనా వైల్డ్ కార్డ్ గా వస్తారా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com