Home

»

Tv News

బిగ్ బాస్ పై సృష్టి కామెంట్స్.. ‘అది మారడం లేదు.. కానీ ఒకటి నేర్చుకున్నా!’

Oct 8, 2026 2:36PM

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్  సృష్టి రీసెంట్ గా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. "నాది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని కూడా చాలామంది చెప్పి నా కోసం స్టాండ్ తీసుకుంటున్నారు. కామన్ మ్యాన్ కేటగిరిలో సెలబ్రిటీ డిఫరెన్షియేషన్ మాత్రం పోవడం లేదు. నేను ఎంత కలుపుకుందాం అనుకున్నా ఆ తేడా మాత్రం మారడం లేదు. అలాగే త్రిగున్ కి మిగతా కంటెస్టెంట్స్ కి కూడా చెప్పారు. ఐతే నేను ఆడిషన్ కి వచ్చినప్పుడు చెప్పాను. నేను మిస్ ఇండియాగా ఆసియ పసిఫిక్ లో ఇండియాని రిప్రెజెంట్ చేసాను. నేను మోడలింగ్ చేస్తున్నాను. నేను యాక్టింగ్ లో ట్రై చేస్తున్నాను. నేను మిస్ ఇండియాలో ఉన్నప్పుడు ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో నాలుగు లైన్స్ చెప్పడానికి ఛాన్స్ దొరికింది. షారుఖ్ ఖాన్ తో దొరికింది ఎలా వదులుకుంటాను. ఆ తర్వాత నేను చాలా చేసాను. మ్యూజిక్ వీడియోస్ చేసాను. రాంప్రసాద్ గారితో ఒక రియాలిటీ షో చేసాను. కానీ అప్పటికి నా పేరు ఎవరికీ తెలీదు. ఇప్పుడు బిగ్ బాస్ వల్లనే నా పేరు అందరికీ తెలిసింది. నన్ను బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఇంతకు ముందు పిలవలేదు. కాబట్టి వెళ్ళలేదు. నేను ఒకటి నేర్చుకున్నా ఏదైనా సాధించాలి అని మనం ట్రై చేయమో అప్పటివరకు ఆ అచీవ్మెంట్ అనేది రాదు. అందుకే అగ్నిపరీక్ష ద్వారా నేను వెళ్లాను" అని చెప్పింది.  

సృష్టి వ్యాకరణం గురించి ఇంతకుముందు ఎవరికీ తెలీదు కానీ బిగ్ బాస్ ద్వారా ఆమె మంచి ఫేమ్ సంపాదించింది. స్టైలిష్ లుక్స్, డ్యాంసింగ్ టాలెంట్ తో మోడలింగ్ వరల్డ్ లో స్పెషల్ గా నిలిచింది. అలాగే ఆమెకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఒడియా భాషల్లో ఆమెకు నైపుణ్యం ఉంది.  "ఫెమినా మిస్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్" టైటిల్ ని 2017 లో గెలుచుకుంది. ఆ తర్వాత యాడ్స్ లో , వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే ఫాషన్ షోస్ లో పాల్గొంది. ఇప్పుడు బిగ్ బాస్ తో ఒక గుర్తింపు తెచ్చుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com