Home

»

Tv News

Illu illalu pillalu : సాగర్ సంచలన నిర్ణయం.. రామరాజు ముఖంపై డబ్బులు విసిరేస్తూ షాకింగ్ ట్విస్ట్!

May 20, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -475 లో.....వల్లిపై డౌట్ తో నిన్ను పెద్ద హాస్పిటల్ లో చూపిస్తానని నర్మద అనగానే ఎందుకు వద్దని వల్లి టెన్షన్ పడుతుంది. ఎందుకు వద్దని అంటున్నావ్.. ఖచ్చితంగా చూపించుకోవాలని వేదవతి అంటుంది . అవును అమ్మ వేరొక హాస్పిటల్ లో చూపించుకుంటే కూడా బెస్ట్ కదా అని రామరాజు అంటాడు. సరే నువ్వు వెళ్లి రెడీ అవ్వు నేను కూడా రెడీ అవుతానని వల్లి అంటుంది. మరొకవైపు ధీరజ్, ప్రేమ ఇద్దరు కలిసి కార్ కి ఏదైనా కిరాయి వాళ్ళు ఫోన్ చేస్తారేమోనని చూస్తారు.

ఆ తర్వాత కామాక్షి తన భర్త ఇద్దరు మార్కెట్ నుండి నడుచుకుంటూ వెళ్తారు. ఆటోకి వెళదామే అని తన భర్త అంటాడు. యాభై రూపాయలు ఖర్చు అవుతుంది వద్దని నడుచుకుంటూ వెళ్తుంది కామాక్షి. అప్పుడే కామాక్షికి ప్రేమ, ధీరజ్ కన్పిస్తారు. మా తమ్ముడు కొత్త కార్ కొన్నాడు. అందులో వెళదామని కామాక్షి తన భర్తతో అంటుంది. ఒరేయ్ తమ్ముడు నన్ను ఇంటి వరకు దింపు అని కామాక్షి అనగానే ఆటో లో వెళ్ళు అని ధీరజ్ కోపంగా అంటాడు. ప్రేమ మాత్రం కామాక్షి తిక్క కుదుర్చాలని ఏంటి ధీరజ్ మీ అక్క అడిగితే దింపవా.. మీరు రండి వదిన అని ప్రేమ కార్ ఎక్కమని చెప్తుంది.మరొకవైపు వల్లి అక్క రెడీ అయ్యావా.. నేను రెడీ అయ్యానని నర్మద పిలుస్తుంటే వల్లి ఇంకా టెన్షన్ పడుతుంది. మరొకవైపు కామాక్షిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసినందుకు అయిదు వందలు ప్రేమ అడుగుతుంది. దాంతో సొంత అక్క దగ్గర డబ్బు తీసుకుంటారా అని కామాక్షి అంటుంది. మరి సొంత అక్క షూరిటి సంతకం పెట్టమ్మన్నప్పుడు పెట్టలేదని ప్రేమ అంటుంది. కామాక్షి భర్త డబ్బు తీస్తుంటే ప్రేమ తన చేతిలో ఉన్న డబ్బు మొత్తం తీసుకుంటుంది. అవి అయిదు వేయిలు అని అతను అంటాడు. పర్లేదు అన్నయ్య మా ఆడపడుచు తమ్ముడు కోసం ఆ మాత్రం ఇవ్వదా అని ప్రేమ అంటుంటే ధీరజ్ నవ్వుకుంటాడు. 

ఆ తర్వాత వల్లి నర్మద హాస్పిటల్ కి వెళ్తుంటే భాగ్యం, ఆనందరావు వస్తారు. మొదటి కాన్పు నేను చూపిస్తానని అంటుంది. వద్దు నేను వెళ్లి హాస్పిటల్ లో వల్లి అక్క ని చూపించి లోపల బిడ్డ ఎలా ఉందో తెలుసుకుంటానని నర్మద అంటుంది. అప్పుడే సాగర్ కోపంగా రామరాజు గారు అని పిలుస్తాడు. అందరు బయటకు వస్తారు. మీరే కదా అయిదు లక్షలు ఇచ్చి వెళ్లిపొమ్మన్నారని డబ్బుని రామరాజు మొహంపై విసిరేస్తాడు సాగర్. దాంతో అందరు షాక్ అవుతారు. సాగర్ చెంపచెల్లుమనిపిస్తుంది వేదవతి. డబ్బు ఇచ్చేసాను ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని నర్మదతో సాగర్ అంటాడు. సాగర్ పై వేదవతి కోప్పడుతుంది. అయినా సాగర్ వినడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com