.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -676 లో....జ్యోత్స్న, దీప ఇద్దరికి నష్టాల్లో ఉన్న చెరొక రెస్టారెంట్ ఇస్తారు. జ్యోత్స్న ఫైల్ పై సంతకం పెడుతుంది. దీప నువ్వు పెట్టు అని కార్తీక్ అంటుంటే జ్యోత్స్న నవ్వుతుంది. అసలు తను ఏం చదువుకుందని జ్యోత్స్న అంటుంది. నీలాగా చుట్టూ పని మనిషులు ఉండి లక్షల్లో పీజు కట్టి చదివే పరిస్థితి తనకి లేదు మిడిల్ క్లాస్ లో ఎలా ఉంటుందో తెలుసా అని కార్తీక్ క్లాస్ తీసుకుంటాడు. దీప కూడా తెలుగులో సంతకం చేస్తుంది. ఇద్దరికి దశరథ్, శివన్నారాయణ ఆల్ ది బెస్ట్ చెప్తారు.
ఇద్దరికి ఎదురు ఎదురుగా క్యాబిన్ లు పెడుతారు. ఇద్దరికీ ఏ రెస్టారెంట్ అలాట్ చేసారో ఫైల్ చూడమని కార్తీక్ చెప్తాడు. తనకి పంజాగుట్ట రెస్టారెంట్ అని జ్యోత్స్న చెప్తుంది. ఇదంతా ఇంగ్లీష్ లో ఉంది నాకు అర్థం కావడం లేదని దీప అంటుంది. నేను చూస్తానని కార్తీక్ చూస్తాడు. నీకు ఇచ్చిన బ్రాంచ్ మైతివనం.. ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుందని కార్తీక్ అంటాడు. ఏది అయితే ఏంటి గెలిచేది నేనే కదా అని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు నా మనవరాలిని వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారోనని పారిజాతం టెన్షన్ పడుతుంది. మరోవైపు కాంచన, శ్రీధర్ లతో శౌర్య ఆడుకుంటుంది.
తాతయ్య నువ్వు వెళ్ళి నానమ్మ కళ్ళు ముయ్.. దాగుడు మూతలు ఆట ఆడుదామని శౌర్య అనగానే కాంచన కళ్ళు శ్రీధర్ ముద్దామని తన దగ్గర దాకా వచ్చి ఆగిపోతాడు. ఏంటి అల్లుడు ఆగిపోయావని పారిజాతం అంటుంది. కళ్ళు మూసినా తెరిచినా చేసిన తప్పే కన్పిస్తుందా అని పారిజాతం అంటుంది. దాంతో పారిజాతం మీద కాంచన కోప్పడుతుంది. పారిజాతం దగ్గరికి శౌర్య వెళ్తుంది. ఇన్ని రోజులు నా మనవరాలు కూతురు అనుకుని నీతో బాగున్నా కదనే.. తెలిసి ఎలా ఉంటానే అని పారిజాతం అనుకుంటుంది. ఇక శౌర్యతో ప్రేమగా ఉన్నట్లు యాక్టింగ్ చేస్తుంది పారిజాతం. మరొకవైపు దీప క్యాబిన్ పక్కన కార్తీక్ కూర్చొని తనకి సైట్ కొడుతుంటే అది చూసి జ్యోత్స్న చిరాకుపడుతుంది.
ఆ తర్వాత రెస్టారెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ల్యాప్‌టాప్ లో ఉందని మేనేజర్ ల్యాప్‌టాప్ తీసుకొని వచ్చి దీప ముందు పెడుతాడు. దీపకి ఏం అర్థం కాదు. కార్తీక్ తనకి చెప్పబోతుంటే బావ నువ్వు నాతో తప్ప ఈ పదిహేను రోజులు ఎవరితో మాట్లాడవద్దు.. సలహా ఇవ్వొద్దు అని జ్యోత్స్న చెప్పగానే కార్తీక్ సైలెంట్ అవుతాడు. దీపని చూస్తూ జ్యోత్స్న నవ్వుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
