
శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే చాలు ఒకప్పుడు సుధీర్. తరువాత రష్మీ ఆది. కానీ ప్రోగ్రామ్స్ రి-షెడ్యూల్ లో అందరూ షఫుల్ ఇపోయారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హోస్ట్ గా ప్రదీప్ వచ్చాడు. రష్మీ జబర్దస్త్ కి వెళ్ళిపోయింది.ఇక ఇప్పుడు ఈ షో 300 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నందుకు స్పెషల్ ఎపిసోడ్ గా ఆడియన్స్ ముందుకు నెక్స్ట్ వీక్ రాబోతోంది. ఇక రష్మీ స్టేజి మీదకు రాగానే ప్రదీప్ షాకయ్యాడు ." హే రష్మీ నువ్వు వస్తావని నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. " అన్నాడు. "నువ్వు కూడా నా ప్లేస్ లో వస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు " అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది రష్మీ.
వెంటనే ఆది "ఎంత శ్రీదేవితో తగ్గిస్తే మాత్రం ఇంత తగ్గిస్తావా " అంటూ ఆమె కాస్ట్యూమ్ గురించి కామెంట్ చేసాడు. తర్వాత ఇంద్రజ వచ్చారు. "రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపడుతున్నారేమిటి " అని అడిగింది. రాననుకున్నారా రాలేననుకున్నారా " అంది. "రానివ్వరనుకున్నా" అన్నారు ఆది. వెంటనే రష్మీ " నోర్ముయ్ ఆది " అనేసరికి ప్రదీప్ ఆది భయపడిపోయారు.
తర్వాత రష్మీ "అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా" అని పాడింది. "పోయాడు కదా అందుకుని "అని సెటైర్ వేసాడు. తర్వాత వంట టాస్క్ ఇచ్చేసరికి బండిలోంచి పొగలొచ్చాయి. అది చూసి రష్మీ జారీచేసింది. వెంటనే ఆది ఒక టైటిల్ చెప్పాడు. " తనను యాంకర్ గా పెట్టలేదని సెట్ నే కాల్చేద్దామని ప్లాన్ చేసిన రష్మీ "అన్నాడు కామెడీగా. తర్వాత ఆది ప్లేస్ చేంజ్ గురించి చెప్పాడు. " ఈ ప్లేస్ లోకి తాను వచ్చినందుకు ఎంత ఆనంద పడ్డాడో నీ ప్లేస్ లోంచి నువ్వు వెళ్ళిపోయినందుకు అతను అంతే బాధపడ్డాడు " అని చెప్పాడు.





.webp)
