.webp)
బుల్లితెర మీద శ్రీసత్య గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ అలాగే ఇప్పుడు విహారి అనే ట్రావెలింగ్ షోకి హోస్ట్ గా చేస్తోంది. అలాటి శ్రీసత్య తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి నెగటివ్ ట్రోలింగ్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
"అవును నేను హీరోయిన్ గా చేస్తున్నాను. ఒకటి థియేటర్ రిలీజ్ ఉంది ఇంకోటి ఓటిటి రిలీజ్ ఉంది. రెండూ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో నెగటివిటీ ఎక్కువైపోయిందండి. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం ముఖాలు ఉండవు కాబట్టి ఎవరికీ దొరకము అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. ఐతే ఎవ్వరికైనా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఒక బోర్డర్ లైన్ ఉంటుంది. ఏదైనా మాట్లాడొచ్చు కానీ ఆ బోర్డర్ లైన్ క్రాస్ చేసి ఏది పడితే అది మాట్లాడుతున్నప్పుడు మాకు ఒక ఫామిలీ ఉంటుంది. మా గురించి తెలిసిన వాళ్ళు సడెన్ ఇలాంటి ఒక నెగటివ్ కామెంట్ చూసినప్పుడు నిజమేనేమో అని నమ్మేస్తారు. కాబట్టి నిజం తెలిస్తే వినండి లేదంటే మాట్లాడకండి. అర్జున్ కళ్యాణ్ నన్ను ఇష్టపడ్డాడు. ముందు నుంచే ఉంది ఆ ఇష్టం. తనకు ఆ విషయం మీద ఒక క్లారిటీ ఉంది. కానీ హౌస్ లోకి వెళ్ళాక తన ఎమోషన్ ని అలా బయట పెట్టేసాడు. హౌస్ లో ఎలా ఉంటుందో బయట ఎవరికీ తెలీదు. కానీ మేము ఇప్పటికీ చాలామంచి ఫ్రెండ్స్. తనకు ఒక క్లారిటీ వచ్చింది తన లైఫ్ లో తానూ బిజీ ఐపోయాడు. నా లైఫ్ లో నేను బిజీగా ఉన్నాను. నా పేరెంట్స్ బతికి ఉన్నంత వరకు నేను బతికి ఉన్నంత వరకు వాళ్ళ బాధ్యత నాదే. నేనే చూసుకుంటాను. ఎవరూ చూసుకోవక్కర్లేదు " అని చెప్పింది శ్రీ సత్య.
ముద్దమందారం సీరియల్ సత్య పరిచయం అయ్యింది. ఆ తర్వాత నిన్నే పెళ్లాడుతా, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, త్రినయని వంటి సీరియల్స్ లో నటించింది. అలాగే నేను శైలజ మూవీలో రామ్ పోతినేనితో కలిసి నటించింది.




.webp)
.webp)
