Home

»

Tv News

కాస్టింగ్ కౌచ్ ఉంది.. నాన్నతో కలిసి తాగుతా... బ్రేకప్ అయ్యింది!

Mar 20, 2026

బుల్లితెర మీద శ్రీసత్య చాల ఫేమస్. అటు సోషల్ మీడియాలో ఇటు షోస్ లో ఈమె బాగా పాపులర్. బిగ్ బాస్ తర్వాత చాలా షోస్ లో కనిపించింది. అలా ఇప్పుడు బిబి జోడిలో చేస్తోంది. అలాంటి సత్య రీసెంట్ ఒక ఇంటర్వ్యూకి వచ్చింది. అందులో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. "మీకు అదృష్టం ఉందా ? టాలెంట్ ఉందా " అని అడిగేసరికి "నేను దరిద్ర దేవత సిస్టర్స్ . నాకు మూవీస్ లో చేయాలనీ ఉంది. నాకు జీరో కాంటాక్ట్స్. ఫోటో షూట్స్ చేసాక కూడా చేంజ్ చేసినవి ఉన్నాయి." అని చెప్పింది. "నీకు తాగుడు, మందు అలవాటు ఉందా . నీది ఏ బ్రాండ్  " అని హోస్ట్ అడిగింది.  

"డ్రింక్ అలవాటు ఉంది మా నాన్న ఏది తెస్తే అది. నేను మా పేరెంట్స్ తోనే ఏదైనా షేర్ చేసుకుంటా. మా నాన్నకు బ్రేకప్ అయ్యింది. నాకు బ్రేకప్ అయ్యింది. అందుకే ఇద్దరం కలిసి కూర్చుని తాగుతాం. " అని చెప్పింది. "పిల్లల్ని అబ్యూజ్ చేస్తూ ఉంటారు కదా ...నీ లైఫ్ లో అలా ఏమన్నా " అని హోస్ట్ అడిగింది. "నేను ఏడవ తరగతి చదివేటప్పుడు రోడ్డు మీద నన్ను ఒకడు నడుము గిల్లేసి వెళ్ళిపోయాడు. రోడ్డు మీద అందరూ చూస్తూ ఉన్నారు  కానీ ఎవరూ వచ్చి అతన్ని ఆపలేదు " అని చెప్పింది శ్రీ సత్య. "ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. నాకు జరిగింది. అలాంటి కాల్స్ వస్తాయి. ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఉంటారు. కానీ డైరెక్ట్ గా ఎవరూ అడగరు" అని చెప్పింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com