
ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. దాండియా స్పెషల్ థీమ్ తో రాబోతోంది. ఇక ప్రోమో ఫుల్ కామెడీగా ఉంది. ఎందుకంటే ఇందులో ఇచ్చిన టాస్క్ అలా ఉంది మరి. లేడీస్ అండ్ జెంట్స్ ని కూర్చోబెట్టి పూలు , దారం ఇచ్చి దండ కట్టమని చెప్పింది. ఇక మరో పక్కన బాలుకి కూడా గట్టిగానే క్లాస్ పీకింది శ్రీముఖి. "ఇక్కడ ఉన్న అమ్మాయిలకు, అబ్బాయిలకు ఎంత బాగా పూలు అల్లడం వచ్చు అనేది చెక్ చేయబోతున్నాం" అని చెప్పింది శ్రీముఖి.
"వావ్. శ్రవణ్ పూలు మాల కట్టడంలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఉంది " అంది. "వాడికి మణికొండలో షాప్ ఉంది" అన్నాడు అవినాష్. దాంతో అందరూ నవ్వేశారు. సుహాసిని అని శ్రీముఖి పిలిచేసరికి "నాకు వచ్చిన ఏకైక పని ఇదే " అంది. "వచ్చా వచ్చా వచ్చా " అంటూ చాలా పెద్దగా ఆశ్చర్యపోయింది. ఇక బాలు దగ్గరకు వచ్చి "ఈ మధ్య సీరియల్ లో కొంచెం రొమాన్స్ ఎక్కువయ్యింది. నడుము గిల్లడాలు, ఎత్తుకోవడాలు అవి ఇవి ..కొంచెం తగ్గిస్తే బాగుంటుంది " అంది సీరియస్ గా . ఇక బాలు పక్కనే ఉన్న మానస్ మధ్యలో వచ్చి "మీరు ఈమధ్యనే చూసారా స్టార్టింగ్ నుంచి చూడలేదు ఐతే" అన్నాడు. ఇక సమీరా భరద్వాజ్ "అయ్యా నా పూలన్నీ రాలిపోతున్నాయి " అంది. వెంటనే హరి వచ్చి "ఇంతవరకు మీ దండకు ఉన్నాయనుకున్నాం మీ చేతికి ఉన్నాయా" అన్నాడు. దాంతో సమీరా పడీ పడీ నవ్వేసింది.
ఇక శ్రీముఖి ఐతే తెగ సిగ్గుపడిపోతూ చున్నీ తిప్పుతూ "బాలు చేతిలో ఉన్న మూర పూలు నాకే కావాలిరా " అంది. వెంటనే హరి "ఫస్ట్ అది మూర అవ్వాలి కదా " అన్నాడు. ఫైనల్ గా అందరూ అల్లిన దండల్ని చూసింది. నిఖిల్ అల్లిన రెండు పూల దండను చూసిన హరి పెద్ద మాటే అన్నాడు సర్. "చెరువుల్లో చేపల కోసం వేసే గేలంలా ఉందిరా అది " అనేశాడు. దాంతో అందరూ నవ్వేశారు.




.webp)
.webp)
