
సిల్వర్ స్క్రీన్ మీద కొన్ని మూవీస్ లో నటించిన సయ్యద్ సోహైల్ సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యాడు. రీసెంట్ గా ఫ్లోరిడా వెళ్ళాడు. ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఇక ఆ రీల్ కి "జిలేబి తేరా షినోడా" అనే ట్రెండింగ్ సాంగ్ కూడా పెట్టుకున్నాడు. ఆ ఫ్లోరిడాలో మొసళ్ళకు సంబంధించిన ఎన్నో పిక్స్ ని పోస్ట్ చేసాడు. ఐతే అక్కడ ఉన్న ఒక పూల్ లో చేపలు పట్టే గేలం తీసుకెళ్లి కొంత మేత వేసి చేపల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
.webp)
ఐతే ఉన్నట్టుండి ఒక చిన్న మొసలి పిల్ల గేలానికి పడింది. అలాగే నెమ్మదిగా ఆ మొసలి పిల్లను నేల మీదకు తీసుకొచ్చాడు కూడా. దాన్ని వీడియో తీసి పోస్ట్ చేసాడు. ఆ తర్వాత ఒక షాప్ లో ఉన్న మొసలి బొమ్మలతో ఉన్న పిక్స్ ని కూడా పోస్ట్ చేసాడు. ఇక నెటిజన్స్ ఐతే ఈ రీల్ చూసి వెరైటీ కామెంట్స్ పోస్ట్ చేశారు. "న్యూ ఫ్రెండా " అని ఒక లేడీ నెటిజన్ అడిగిన ప్రశ్నకు "హా నీకు తీసుకొస్తా పెంచుకో ఇంట్లో " అని రిప్లై కూడా ఇచ్చాడు.
"ట్రెండ్ బెండు తీస్తున్నారన్నా. .. కొత్త పెట్ బాగుంది... పేరేంటి బ్రో... క్రొకోడైల్ తో ఎం చేస్తున్నారు... " అంటూ సరదా కామెంట్స్ చేశారు. ఇంకో నెటిజన్ ఐతే
"అండమాన్ రండి సర్. ఇక్కడ మీ ఫాన్స్ చాలా మంది ఉన్నారు " అనేసరికి "తప్పకుండా వస్తా మా " అంటూ రిప్లై ఇచ్చాడు. ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ పెట్టి ట్రెండ్ ఫాలో అవుతున్నారు అంటూ సోహైల్ ని ఆటపట్టించారు.
-----------------





.webp)
