Home

»

Tv News

 నా డబ్బులు బ్రో....  తగలెట్టుకుంటానో ఏం చేసుకుంటానో...నీకెందుకు బ్రో​

Oct 12, 2026 6:08PM

సోషల్ మీడియా అనేది ఎంత మంచిదో అంత నెగటివ్ షేడ్స్ కూడా ఉన్నది. అందులో సెలబ్రిటీస్ కావొచ్చు, కామన్ మ్యాన్ కావొచ్చు ఎవ్వరైనా సరే వాళ్ళ వాళ్ళ అభిరుచుల్ని బట్టి రీల్స్ , వీడియోస్, స్టోరీస్ చేస్తూ ఉంటారు. ఐతే వాళ్ళ లుక్స్, కాస్ట్యూమ్స్, వగైరా వగైరా చూసి చాలా సంపాదించేస్తున్నారు అంటూ కూడా జనాలు అపోహ పడుతూ నెగటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఐతే అక్కడ వాళ్ళ కష్టాలు వాళ్లకు ఉంటాయి. కానీ అవి ఏంటి అనేది ఎవరికీ తెలీదు. కానీ డబ్బులు సంపాదించేస్తున్నారు అనే మాటను మాత్రం ఈజీగా ఆనిస్తూ ఉంటారు. ఆ విషయం మీద సింగర్ సాకేత్ రీసెంట్ గా ప్రసారమైన ఫామిలీ స్టార్స్ ఎపిసోడ్ లో చెప్పుకొచ్చాడు.

"బేసిక్ గా నేను చాలా షోస్ చేస్తూ ఉంటాను. రికార్డింగ్స్, షూట్స్ చేస్తూ ఉంటాను. ఈ స్ట్రెస్ ని పోగొట్టుకోవడానికి వీకెండ్ లో క్లబ్ కి వెళ్లి ఆ మ్యూజిక్ వింటాను. అప్పుడు నా స్ట్రెస్ అనేది పోతుంది. ఆ తర్వాత రోజు మళ్ళీ నేను ప్రోపర్ గా పని చేసుకోగలుగుతాను. చాలా సిన్సియర్ గా క్లియర్ గా చెపుదామనుకుంటుంది ఏంటంటే... ఏ రోజైనా 7 గంటల పాటు పని చేస్తే ఆ రోజే నేను బయటకు వెళ్తాను.  స్పెషల్ అకేషన్స్ తప్ప మిగతా టైములో నేను ఎక్కడికీ వెళ్ళను. ఇది నాకు నేను పెట్టుకున్న రూల్. నా డబ్బులు, నా పార్టీ, మీకెందుకు, ఆ ఆ బాగా సంపాదించేస్తున్నాడు, బాగా ఎగిరేస్తున్నాడు. నువ్వెవడివిరా నువ్వేమన్నా ఇస్తున్నావా, నువ్వేమన్నా బిల్ కడుతున్నావా. నేను కష్టపడి, నేను గొంతు చించుకుని పాడి దాని నుంచి వచ్చిన డబ్బులతో కొనుక్కున్నా. నేనెవడినీ మోసం చేయలేదు. నేను నీ ఇంటికి వచ్చి డబ్బులు అడగలేదు. నువ్వేం నాకు పెట్టట్లేదు. నేను మా అమ్మా నాన్నను కూడా అడగట్లేదు. నా సంపాదనతో కొనుక్కుంటున్నా నా కంఫోర్ట్స్ నా బట్టలు. ఇవి మీ డబ్బులు కాదు బ్రో కాదు నేను కస్టపడి సంపాదించుకుంటున్నవి. మేము తగలెట్టుకుంటామో, బట్టలు కొనుక్కుంటామో, షూస్ కొనుక్కుంటామో మీకు సంబంధం లేని విషయం. అంతకు కావాలంటే మీరూ కొనుక్కోండి. " అంటూ ఫైర్ అయ్యాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com