
తెలుగు ఓటీటీ లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'Part Timers' సీరియల్ హవా నడుస్తోంది. ముఖ్యంగా ఇందులో సింధు పాత్రలో నటిస్తున్న తనుజ పుట్టస్వామి నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
తాజాగా తనుజ తన ఇన్‌స్టాగ్రామ్ లో రెండు స్టోరీలు షేర్ చేసింది. మొదటి స్టోరీలో ఒక ఫ్యాన్ పెట్టిన మెసేజ్ ఉంది. "లాస్ట్ 4 ఎపిసోడ్స్ చూశా, సింధు రోల్ లో నీ నిజ జీవితమే కనిపిస్తుంది. డైలాగ్స్ చాలా టచింగ్ గా, రియలిస్టిక్ గా ఉన్నాయి" అని ఆ ఫ్యాన్ ఎమోషనల్ గా రాసింది. దానికి తనుజ "S 100% correct" అని హార్ట్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. అంటే ఆ పాత్ర తన మనసుకు ఎంత దగ్గరగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండో స్టోరీలో తనుజ రాత్రి 11:11 నిమిషాలకు ఒక సెల్ఫీ పెట్టింది. బ్లూ కలర్ టీషర్ట్ లో చాలా సింపుల్ గా, క్యూట్ గా కనిపిస్తోంది. దాని మీద "ప్రతి క్షణం, ప్రతి బాధ్యత, ప్రతి చిన్న ఆశీర్వాదానికి నేను ఎంతో కృతజ్ఞురాలిని. విశ్వానికి నా ధన్యవాదాలు" అని రాసింది. 11:11 అంటే కోరిక కోరుకునే సమయమని చాలా మంది నమ్ముతారు. ఆ సమయంలో ఆమె ఇలా గ్రాటిట్యూడ్ పోస్ట్ పెట్టడం ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది.
నిజానికి తనుజ పుట్టస్వామి బిగ్ బాస్ తర్వాత తనకు తానుగా ఎదుగుతూ వస్తోంది. ఎలాంటి హంగామా లేకుండా, తన నటనతోనే గుర్తింపు తెచ్చుకుంటోంది. Part Timers లో సింధు పాత్రలో ఆమె పడే కష్టం, చెప్పే డైలాగ్స్ చాలా మంది అమ్మాయిల జీవితాలకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.ప్రస్తుతం ఈ రెండు స్టోరీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనుజ నటనకు, ఆమె పాజిటివ్ థాట్స్ కు ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.





