Home

»

Tv News

Karthika Deepam2 : కాంచన ఆగ్రహానికి బలైపోయిన కార్తీక్!

May 05, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -661 లో.. కార్తీక్ ఇంటికి రాగానే ఏంటి రా ఎక్కడికి వెళ్ళావని కాంచన అడుగుతుంది. రాగానే నిలబెట్టి అడగాలా అత్తయ్య అని దీప అంటుంది. నాన్న ఒంట్లో బాలేదు అందుకే టెస్ట్ ల కోసం హాస్పిటల్ కి వెళ్ళాను అని కార్తీక్ అనగానే కాంచన కంగారుపడుతుంది నువ్వేం టెన్షన్ పడకు అమ్మ.. నాన్న బాగున్నాడు ఇప్పుడే ఇంట్లో డ్రాప్ చేసి వస్తున్నానని కార్తీక్ అంటాడు. నువ్వు ముందు భోజనం చెయ్ అని కార్తీక్ అంటాడు.. ఆకలిగా లేదని కాంచన అంటుంది. ఎందుకు అమ్మ.. నాన్నపై అంత ప్రేమ పెట్టుకొని దూరం పెడుతున్నావని కార్తీక్ అనగానే ప్లేట్ తీసుకొని భోజనం చేస్తుంది. దీప ప్లేట్ లో కర్రీ వెయ్ నటించే పనిలో పడి కర్రీ వేసుకోలేదని కార్తీక్ అంటాడు.

మరుసటిరోజు కాంచన హాల్లో కూర్చొని ఉంటుంది. కార్తీక్ వస్తాడు.. దగ్గరికి రారా అని కాంచన అంటుంది. కార్తీక్ దగ్గరికి రాగానే చెంప చెల్లుమనిపిస్తుంది. కాంచన. మీ నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిందని నాతో ఎందుకు చెప్పలేదని కాంచన కోప్పడతుంది. ఇప్పుడే కావేరి ఫోన్ చేసి ఏం జరిగిందో చెప్పింది.. మా నాన్న కూడా మా అమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయినట్లు చెప్పలేదు.. అలా చెయ్యాలనుకున్నావా అని కార్తీక్ పై కాంచన కోప్పడుతుంది. ఆ తర్వాత మనం హాస్పిటల్ కి వెళ్ళాలని కార్తీక్ అంటాడు. మరి మీ నాన్న ఎలా వస్తాడని కాంచన అనగానే కాశీకి కార్తీక్ ఫోన్ చేసి నాన్నని హాస్పిటల్ కీ తీసుకొని రా అని అంటాడు. దాంతో శ్రీధర్ ని తీసుకొని కాశీ హాస్పిటల్ కి వెళ్తుంటే.. నేను తోడుగా వస్తానని స్వప్న వెళ్తుంది. ఆ తర్వాత శ్రీధర్ కి డాక్టర్ చెకప్ చేసి బయటకు వస్తాడు. తన హార్ట్ వీక్ ఉంది ఇంకొకసారి హార్ట్ స్ట్రోక్ వస్తే బ్రతకడు.. తను టెన్షన్ పడొద్దు.. ప్రశాంతంగా ఉండేలా చెయ్యాలని డాక్టర్ చెప్తాడు. దాంతో కాంచన షాక్ అవుతుంది.

అయన ఆరోగ్యం మీ చేతిలో ఉందని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత పారిజాతం హాల్లో కూర్చొని ఉండగా జ్యోత్స్న వస్తుంది. నిన్న కొట్టిన దెబ్బకి తగ్గినట్లు ఉందని పారిజాతం అంటుంది. బావ నిన్ను వాళ్ళు ఆడే ఆటలో అరటిపండు చేస్తున్నాడని జ్యోత్స్న అంటుంది. అరటిపండు ఆరోగ్యానికి  మంచిది అని పారిజాతం అంటుంది. అప్పుడే దీప వస్తుంది. బావ ఎక్కడ అని జ్యోత్స్న అడుగుతుంది. దీప ఏదో చెప్పబోతుంటే.. ఎప్పుడు ఏదో ఒక సోది చెప్తావని జ్యోత్స్న కోప్పడుతుంది. దీప నువ్వు వెళ్ళు అని పారిజాతం అంటుంది. దీప బంగారం అని కావాలనే జ్యోత్స్న ముందు పారిజాతం అంటుంది. నీకు ఆ దీప ఏం మందు పెట్టిందో ఏమో అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com