.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -673 లో.... బోర్డు మీటింగ్ లో బోర్డు మెంబర్స్ జ్యోత్స్న సీఈఓగా ఉండాలని చెప్తారు. దశరథ్, కార్తీక్ మాత్రం దీప అని చెప్తారు. దాంతో ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకోవాలని చీటీలపై ఎవరు సీఈఓగా ఉండాలో రాయాలని శివన్నారాయణ చెప్తాడు. ఇద్దరికి సమానమైన ఓట్లు వస్తాయి. దాంతో ఇద్దరు సీఈఓగా ఉండండి అని శివన్నారాయణ అంటాడు. అలా ఏం వద్దని జ్యోత్స్న అంటుంది.
అయితే ఇద్దరికి ఒక పోటీ పెడుతున్నాను.. అందులో ఎవరు గెలిస్తే వాళ్లే సీఈఓ. మన రెస్టారెంట్ రెండు బ్రాంచ్ లో నష్టాల్లో ఉన్నాయి.. ఆ రెండు చెరొకటి ఇస్తాను.. మీకు రెండు వారాలు టైమ్ ఇస్తాను.. ఎవరైతే రెస్టారెంట్ ని ముందుగా నష్టాల్లో నుంచి బయటకి తెస్తారో.. వాళ్లే విజేత వాళ్లే సీఈఓ అని శివన్నారాయణ అంటాడు. నాకు ఒకే అని జ్యోత్స్న, దీప అంటారు. ఆ తర్వాత దీపకి బావ సలహాలు ఇవ్వొద్దు.. వాళ్ళు ఈ రెండు వారాలు దూరంగా ఉండాలని జ్యోత్స్న అనగానే అందరు తనపై కోప్పడతారు. బావ సపోర్ట్ లేనిదే దీప గెలవలేదా అని ఇండైరెక్ట్ గా జ్యోత్స్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీనికి నేను ఒప్పుకుంటున్నానని దీప అనగానే దశరథ్, కార్తీక్ షాక్ అవుతారు. బావ మా ఇంట్లో ఉంటాడు. దీప వాళ్ళింట్లో ఉండడు.. వీళ్లిద్దరు కలవకూడదని జ్యోత్స్న షరతు పెడుతుంది.
ఆ తర్వాత కాంచన దగ్గరికి శ్రీధర్ వెళ్తాడు. అప్పుడే కార్తీక్, దీపలని తీసుకొని జ్యోత్స్న వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావే అని కాంచన కోప్పడుతుంది. నీ కొడుకుని తీసుకొని వెళ్ళడానికి వచ్చానని జ్యోత్స్న అనగానే అదేం మాట్లాడుతుందిరా అని కాంచన అంటుంది. దాంతో బోర్డు మీటింగ్ లో జరిగింది మొత్తం చెప్తారు. కండిషన్ చెప్తుంది అదంతా విని ఎందుకు ఒప్పుకున్నారని కార్తీక్, దీపలపై కాంచన కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
