.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -16 లో.... మురళి బార్ దగ్గర డ్రింక్ చేస్తాడు. వద్దని సూర్య ఎంత అంటున్నా కూడా మురళి వినడు. మురళికి జానూ ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ని సూర్య లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. మీ బావ డ్రింక్ చేస్తున్నాడని సూర్య చెప్పగానే నేను వస్తున్నా.. అక్కడే ఉండండి అని జానూ చెప్తుంది. తర్వాత కాసేపటికి జానూ బార్ దగ్గరికి వెళ్లి తన స్కూటీపై సూర్య సాయంతో మురళిని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. మరొకవైపు పెద్దావిడ డల్ గా ఉంటుంది. తన దగ్గరికి శంకర్ వస్తాడు.
నాకు నీ గురించి టెన్షన్ అవుతుందని శంకర్ తో పెద్దావిడ చెప్తుంది. పర్లేదులే అమ్మ.. ఇంకొక నాలుగేళ్లు కష్టపడితే చాలు అని శంకర్ అంటాడు. ఆ తర్వాత మురళిని తీసుకొని జానూ, సూర్య ఇంటికి వెళ్తారు. మురళిని ఆ పరిస్థితిలో చూసి మురళి తల్లి శాంతి షాక్ అవుతుంది. నా కొడుకుని చివరికి తాగుబోతు వాడిని చేసారని జానూపై శాంతి కోప్పడుతుంది. ఆ తర్వాత జానూ, సూర్య బయటకు వస్తారు. నన్ను మా ఇంట్లో డ్రాప్ చెయ్యండి అని సూర్య అంటాడు. మిమ్మల్ని మీ ఇంట్లో డ్రాప్ చేసి ప్రొద్దున స్కూటీ తీసుకొని వచ్చి మీకు ఇస్తానని సూర్య అంటాడు. ఆ తర్వాత సింహాద్రికి శంకర్ ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చెయ్యాలి పెళ్లి దగ్గర పడుతుందని చెప్తాడు. శంకర్ అలా అనగానే ఆ విషయం నేను చూసుకుంటానని సింహాద్రి అంటాడు. ఆ తర్వాత తోటలో నిన్ను అడుగుకూడా పెట్టనివ్వనని సింహాద్రి అనుకొని నవ్వుకుంటాడు. మరోవైపు జానూని వాళ్ళింట్లో డ్రాప్ చేస్తాడు సూర్య. ఎక్కడికి వెళ్ళావని జానుని శంకర్ అడుగుతాడు. దాంతో జానూ జరిగింది మొత్తం చెప్తుంది.
నందు కాకపోతే వేరే అమ్మాయి దొరకదా.. వాడు ఎందుకు అలా చేస్తున్నాడని శంకర్ అంటాడు. అక్కని బావ ఇష్టపడ్డాడు కదా అని జానూ చెప్తుంది. పెళ్లికి కావల్సిన డబ్బు మన దగ్గర ఉందా అని శంకర్ ని జానూ అడుగుతుంది. సింహాద్రికి కొంత డబ్బు పంపాను.. ఎంతుందో వాడిని కనుక్కోవాలని శంకర్ అంటాడు. మరుసటిరోజు మురళి ఉదయం లేచి బయటకు వెళ్తుంటే శాంతి ఎదురుపడి రాత్రి తాగింది దిగలేదా అని కోప్పడుతుంది. మరొకవైపు సూర్య బయటకు వస్తుంటే భువన ఎదురుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

