Home

»

Tv News

Godhavari: శంకర్ హఠాన్మరణం.. కన్నతండ్రి మరణంతో కుప్పకూలిన కూతుళ్లు!

Jun 6, 2026 11:44AM

స్టార్ మా  టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-23 లో.. శంకర్ కోసం కుటుంబమంతా ఎదురుచూస్తుంటారు‌. ఇక అప్పుడే శంకర్ ఇంటికి వస్తాడు. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే శంకర్ డల్ గా రావడంతో అందరు ఆందోళన పడతారు. వచ్చీ కుర్చీలో కూలబడిపోతాడు శంకర్. ఏం అయిందని ఎవరు అడిగినా సమాధానం చెప్పడు. ఇక అందరు ఏం అయిందని అడిగేసరికి .. నందు పెళ్ళి సవ్యంగా జరగాలని గుడికి వెళ్ళి మొక్కుకున్నానని అబద్ధం చెప్తాడు శంకర్. ఇక మురళి, సూర్య పెళ్ళి పనులు చూసుకుంటామని భరోసా ఇస్తారు.

ఇక మీరు వెళ్ళి రెస్ట్ తీస్కోండి మామయ్య..నేను చూస్కుంటానని మురళి అనగానే శంకర్ కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక మురళి వెళ్ళొస్తానని అనగానే నాకొక మాటిస్తావారా అని శంకర్ అడుగుతాడు. ఏంటి మామయ్య అని మురళి అడుగుతాడు. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూస్కుంటానని మాట ఇవ్వరా అని శంకర్ అనగానే మురళి మాటిస్తాడు. ఆ తర్వాత శంకర్ తన గదిలోకి వెళ్లి ఆలోచిస్తుంటాడు. సింహాద్రి తనని మోసం చేసి తోట తన పేరున రాపించుకున్న విషయం ఒకటి.. ఆ విషయం గురించి ఎవరికైనా చెప్తే కుటుంబాన్ని నాశనం చేస్తానని సింహాద్రి అన్న విషయం తల్చుకొని టెన్షన్ పెరిగిపోతుంది. అవే ఆలోచిస్తూ కూర్చుంటాడు శంకర్. అప్పుడే జాను వస్తుంది. అమ్మా జాను అని శంకర్ పిలవగానే ఏంటి నాన్న అని జాను అడుగుతుంది. నాకొక మాటిస్తావా.. నేను రేపు వెళ్ళిపోయాక అనేలోపే.. అలా మాట్లాడొద్దని జాను ఆపేస్తుంది. అది కాదమ్మ.. రేపు నేను దుబాయ్ కి వెళ్తే కుటంబాన్ని జాగ్రత్తగా చూస్కుంటావా అని అడుగుతాడు. మీరు మర్చిపోయ హ్యాపీగా ఉండండి నాన్న అని జాను అంటుంది. అమ్మ నీ గురించి నాకు ఏ దిగులు లేదు.‌ కానీ మీ అమ్మకి వంటిల్లే లోకం.. మీ నానమ్మకి దేవుడే దిక్కు అన్నట్టుగా ఉంది.. నందుకి అమెరికాకి వెళ్ళాలని తప్పా జీవితం మీద ఆశ లేదు.. గౌతమి ఒకదాని మీద స్థిరంగా ఉండదు..
చిన్నది కిన్నెరకి లోకజ్ఞానం లేదు..  వీళ్ళందరిని నువ్వే జాగ్రత్తగా చూస్కోవాలని శంకర్ అంటాడు.

ఆ తర్వాత శంకర్ మాటలని జాను ఫోన్ లో రికార్డు చేసుకుంటుంది. ఇక‌ జాను వెళ్ళాక శంకర్ జరిగిందే తల్చుకుంటూ పడుకుంటాడు. మరుసటి రోజు అందరు పెళ్ళి పనుల్లో బిజీగా ఉంటారు. నందుని పెళ్ళికూతురిలా రెడీ చేస్తుంది గౌతమి. సూర్య, మురళి కార్ ని డెకరేట్ చేస్తుంటారు. అదేసమయంలో శంకర్ ఇంకా లేవలేదని కిన్నెరని లేపమని వాళ్ళ అమ్మ పంపిస్తుంది. కానీ తను ఎంత లేపినా శంకర్ లేవడు‌‌. దాంతో వాళ్ళ అమ్మని పిలుస్తుంది కిన్నెర. ఇక తను వచ్చి లేపినా శంకర్ లేవడు.‌. ఇక దాంతో తను ఏడుస్తూ నందు, జాను, గౌతమి, మురళి వాళ్ళని పిలుస్తుంది. జాను చూసి చనిపోయాడని తెలుసుకొని బాధలో కూలబడిపోతుంది. తర్వాత మురళి వచ్చి చూస్తాడు. గుండెపై తలవాల్చి చూసి షాక్ అవుతాడు. మామయ్య చనిపోయాడని చెప్పగానే అందరు ఏడుస్తారు. అది మోస్ట్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఆ తర్వాత శంకర్ కి స్నానం చేపించి, ఏడుస్తూ శ్మశానానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com