.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -22 లో....నందుకి పసుపు స్నానం చేయిస్తారు. అందరు సంతోషంగా ఉంటారు. నాన్న నీకు మంచి డ్రెస్ తీసుకొని వచ్చాను.. మీరు రేపు పెళ్లిలో ఇదే వేసుకోవాలని జానూ చెప్తుంది. నాన్నకేనా మాకేం లేదా అని నందు అడుగుతుంది. ఉంది రేపు పెళ్లిలో ఇస్తానని జానూ అంటుంది. మా అయన అసలే అమెరికాలో ఉంటాడు.. రిసెప్షన్ గ్రాంఢ్ గా చెయ్యాలని నందు అంటుంది. మరొకవైపు నువ్వు ఎందుకు వాళ్ళింటికి వెళ్తున్నావని మురళిపై వాళ్ళ అమ్మ శాంతి కోప్పడుతుంది.
ఆ తర్వాత నందు, శంకర్, జానూ వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తారు. అప్పుడు తన వియ్యంకుడు కాల్ చేసి. రేపు రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇస్తేనే పెళ్లి జరుగుతుందని అతను అంటాడు. రేపటి లోగా సింహాద్రి రిజిస్ట్రేషన్ పేపర్స్ తీసుకొని వస్తానన్నాడు.. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాడేంటి ఒకసారి ఫోన్ చెయ్యాలని సింహాద్రికి శంకర్ ఫోన్ చేస్తాడు. తన భార్య లిఫ్ట్ చేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడని చెప్తుంది. దాంతో సింహాద్రి దగ్గరికి శంకర్ బయల్దేరతాడు. మరొకవైపు ఆ తోట నాది.. నాకే సర్వహక్కులు ఉన్నాయని తన ఫ్రెండ్స్ తో సింహాద్రి చెప్తుంటే శంకర్ విని కోపంగా సింహాద్రి అని గట్టిగా అరుస్తాడు..
ఓహ్ విన్నావా ఇంకా ఏం అబద్ధం చెప్పి కవర్ చెయ్యాలో అనుకున్నాను.. ఇక దాచడం ఎందుకు.. ఆ తోట నాదే.. నా పేరునే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను.. చిన్నప్పుడు నువ్వు నా కన్నా ఎగ్జామ్ బాగా రాసావని రిజల్ట్స్ రాకముందే ఆఫీస్ రూమ్ తగలబెట్టాను..ఎందుకంటే నా కంటే నీకు ఎక్కువ మార్క్స్ వస్తే నేను తట్టుకోలేను.. ఇప్పుడు నాకంటే డెవలప్ అవుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటానని సింహాద్రి అంటాడు. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా.. నాకు ఈ తోట కావాలంటే ఇచ్చేవాడిని కదా అని శంకర్ అనగానే ఇచ్చానని అనుకోమని సింహాద్రి అంటాడు. ఇప్పుడు నా కూతురు పెళ్లి దాంతో ముడిపడి ఉందని శంకర్ అంటాడు. నీ కాళ్ళు పట్టుకుంటా రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇవ్వమని శంకర్ అడుగుతాడు. అయిన సింహాద్రి ఇవ్వడు.. దాంతో సింహాద్రి కాలర్ పట్టుకొని అడుగుతాడు.. ఇవ్వకపోయేసరికి శంకర్ తిరిగి ఇంటికి వెళ్తాడు. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పినా నీ ఫ్యామిలీలో ఎవరు మిగలరని సింహాద్రి చెప్తాడు. తరువాయి భాగంలో ప్రొద్దున శారద వాళ్ళు వచ్చి శంకర్ ని నిద్ర లేపుతారు. అతను లేవకపోయేసరికి అందరు వస్తారు. అంకుల్ చనిపోయాడని సూర్య చెక్ చేసి చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
