
బిగ్ బాస్ తెలుగు 10 లో నిన్నటి ఎపిసోడ్ లో సీక్రెట్ రూమ్ నుంచి షాలిని రీ ఎంట్రీ ఇచ్చింది. తను వచ్చీ రాగానే తన నోటిదూల మొదలుపెట్టింది. మొదటగా త్రిగుణ్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్. అక్కడ అప్పటికే షాలిని ఉండటంతో అతను ఫుల్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత షాలినిని హౌస్ లోకి తీసుకొని వెళ్ళమన్నాడు బిగ్ బాస్. దాంతో త్రిగుణ్ అప్పటికప్పుడు ఒక స్ట్రాటజీ ప్లే చేశాడు. నేను హౌస్ లోకి వెళ్ళి రోహిత్ ని పిలుస్తాను.. నువ్వు సడెన్ గా వచ్చెయ్ అని త్రిగుణ్ అనగానే షాలిని సరే అంటుంది. ఆ తర్వాత కిచెన్ లో ఉన్న రోహిత్ ని తన స్ట్రాటజీ ప్రకారం కన్ఫెషన్ రూమ్ దగ్గరికి తీసుకొని వస్తాడు త్రిగుణ్. కాసేపటికి షాలిని రాగానే రోహిత్ హ్యాపీగా ఫీల్ అయి హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత అందరు షాక్ అవుతారు.
కాసేపటికి బిగ్ బాస్ డెస్టినీ బాక్స్ టాస్క్ ఇస్తాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యుల్ని రెడ్, ఎల్లో లెవెల్ గా విడగొట్టాడు బిగ్ బాస్. రెడ్ లెవెల్ లో ఝాన్సీ, రామ్ ప్రసాద్, శ్వేత, రోహిత్, రామకృష్ణ, వంశీ, షాలినీ, దక్షి ఉండగా.. ఎల్లో లెవెల్ లో త్రిగుణ్, నరేష్, ముకేష్, నీతూ, దేబ్జానీ, శివ్, అమన్ లు ఉన్నారు.ఈ టాస్క్ లో సర్కిల్ లో ఉన్న బోన్ ని దక్కించుకుని బాక్స్ లు బద్దలు కొట్టాలి. ఎల్లో కలర్ వస్తే ఎదుటి టీం నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేయొచ్చు.బ్లూ వస్తే ఎవరిని ఎలిమినేషన్ చేయడానికి లేదు. ఈ క్రమంలోనే షాలినీ, దక్షి మధ్య మాటామాటా పెరిగింది. బోన్ కోసం ఇద్దరూ మీదమీదకు వెళ్లారు, ఒకరిపై ఒకరు అరిచారు, తగ్గేదే లేదు అన్నట్టుగా గొడవ పడ్డారు.షాలినీ రీ ఎంట్రీ తర్వాత రోహిత్ ఫుల్ ఖుషీగా ఉన్నా, మిగతా హౌస్ మేట్స్ మాత్రం షాక్ లో ఉన్నారు. వచ్చీ రాగానే దక్షిపై విరుచుకుపడటంతో హౌస్ లో టెన్షన్ మొదలైంది.
ఈ గేమ్ లోనే బిగ్ బాస్ ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. రెడ్ బాక్స్ లో ఉన్నవారు సడెన్ ఎలిమినేషన్ కి దగ్గర్లో డేంజర్ జోన్ లో ఉంటారు. గ్రీన్ బాక్స్ లోకి వెళ్ళిన వారు ఎలిమినేషన్ నుండి సేవ్ అవుతారని బిగ్ బాస్ చెప్పడంతో ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ కన్ఫమ్ అని బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు.






