.webp)
బిగ్ బాస్ నుంచి రీసెంట్ గా షాలిని ఎలిమినేట్ అయ్యింది. షాలిని అగ్ని పరీక్ష నుంచి అందరినీ మెప్పిస్తూ వచ్చింది. అగ్ని పరీక్షలో ఆమె మాటలకు అభిజిత్ కూడా ఫిదా ఐపోయాడు. ఐతే రీసెంట్ గా ఆమె చెప్పిన కొన్ని విషయాలున్న ఒక రీల్ వైరల్ అవుతోంది. " 17 ఏళ్ళ వయసు నుంచి ఇంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నేను ఇండిపెండెంట్ గా ఉండడం ఇష్టం. నేను బిగ్ బాస్ గ్రూప్ డిస్కషన్ కి సెలెక్ట్ ఐనప్పుడు ఆఫీస్ లో లీవ్ ఇవ్వలేదు. ఐతే ఆస్ట్రేలియాలో నేను వర్క్ చేసేది మా మేనేజర్ కి తెలుగు వచ్చు. ఐతే లీవ్ కోసం చాలా రిస్క్ చేసాను. మా తాతయ్యకు బాలేదు ఫామిలీ ఎమర్జెన్సీ . ఎట్టి పరిస్థితిలో ఇండియా వెళ్ళాలి అని చాలా కన్విన్స్ చేసి వచ్చాను. ఇది ఎవరు చూసారో లేదో తెలీదు. కానీ ఇంకా కొన్ని డేస్ నాకు లీవ్ అప్రూవ్ అయ్యింది. జాబ్ పోవచ్చు, ఆస్ట్రేలియా వీసా కూడా పోవచ్చు ట్రై చేసి ఫెయిల్ అవ్వడం బెటర్ అనిపించింది. గ్రూప్ డిస్కషన్ లో సెలెక్ట్ అవుతానని నాకు తెలీదు. అంత ఖర్చు పెట్టుకుని ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. " అని చెప్పింది.
ఇక తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది . ఈ ప్రయాణంలో ఎన్నో భావోద్వేగాలు, సవాళ్లు, కన్నీళ్లు, చిరునవ్వులు, మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పింది. ప్రతి అనుభవం తనకు ఏదో ఒక విషయాన్ని నేర్పించిందని , తనను నమ్మినవారికి, తన భావాలను అర్థం చేసుకున్నవారికి, కష్ట సమయాల్లో అండగా నిలిచినవారికి, ప్రేమతో మద్దతు ఇచ్చిన అభిమానులకు షాలిని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. తాను పరిపూర్ణమైన వ్యక్తిని కాకపోయినా, ఎప్పుడూ తనలాగే ఉండేందుకు, తన వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించానని చెప్పింది. ఈ అవకాశం కల్పించిన బిగ్‌బాస్ తెలుగు 10, స్టార్ మా, జియోహాట్‌స్టార్‌తో పాటు నాగార్జునకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బిగ్‌బాస్ ఇంట్లో తన ప్రయాణం ముగిసినా, అభిమానులతో ఏర్పడిన అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుందని చెప్పింది.
---------------




.webp)
