Home

»

Tv News

షాలిని-రోహిత్ హగ్, వర్షిణి-ముఖేశ్ రొమాన్స్.. బాల్స్ టాస్క్ లో గెలిచిందెవరంటే!

Oct 9, 2026 10:31AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో 32వ రోజు రసవత్తరంగా సాగింది. ఝాన్సీ, ముఖేశ్ గత వీకెండ్ లో గెలుచుకున్న గిఫ్టులను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు. ఈ రోజు లీడర్ బోర్డులో పైకి వెళ్లి నామినేషన్స్ నుంచి సేఫ్ అవ్వడం కోసం బిగ్ బాస్ కొన్ని టాస్కులు ఇచ్చారు. ప్రస్తుతం అపూర్వ-చరణ్, అమన్-త్రిగున్, ముఖేశ్-ఝాన్సీ, నరేష్-రామ్ ప్రసాద్, రోహిత్-షాలినిలు జంటలుగా ఆడుతున్న సంగతి తెలిసిందే.

నిన్నటి ఎపిసోడ్ లో బాల్స్ తో పెద్ద టాస్క్ ఇచ్చారు. ఐదు బాల్స్ ని తీసుకెళ్లి హోల్స్ లో పెట్టాలి.. ఎవరు ముందు పూర్తి చేస్తే వాళ్లు గేమ్ పూర్తి అవ్వని , చివర్లో ఉన్నవాళ్ళ బాక్స్ లోని బాల్స్ తీసేయొచ్చని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ కి వంశీ, దేబ్జానీలు సంచాలక్ గా వ్యవహరించారు. ఇందులో షాలిని, అపూర్వ, రామ్ ప్రసాద్, ముఖేశ్, అమన్ ఆడారు. టాస్క్ లో అమన్, రామ్ ప్రసాద్, ముఖేశ్, షాలిని, అపూర్వ వరుస క్రమంలో పూర్తి చేశారు. దీంతో అమన్-త్రిగున్ గ్రూప్ కి ఎక్కువ పాయింట్స్ వచ్చి నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు.

ఆట తర్వాత అపూర్వతో రోహిత్ మాట్లాడుతుంటే షాలిని వచ్చి గొడవ పడింది. స్విమ్మింగ్ పూల్ లో బిగ్ బాస్ సాంగ్స్ వేయడంతో వర్షిణి-ముఖేశ్ రొమాన్స్ చేయగా షాలిని-రోహిత్ హగ్గులతో రెచ్చిపోయారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com