
బిగ్ బాస్ సీజన్-10 తెలుగులో రోజు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.. ఆరో వారంలో ఎలిమినేట్ అయినట్టు చూపించి సీక్రెట్ రూమ్ లో ఉంచిన షాలినీ.. ఏడో వారంలో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ త్రిగుణ్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి షాలినీని సర్ ప్రైజ్ గా తీసుకురమ్మని చెప్పాడు. షాలినీని చూడగానే రోహిత్ షాక్ అయి హత్తుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ కి షాలినీ రీ ఎంట్రీ పండగే అయింది. కానీ రామ్ ప్రసాద్ మాత్రం "అందరూ ఉంటే ఈ గేమ్ ఎందుకు? గేమ్ ముందుకు వెళ్లాలి, జనాలు తగ్గాలి" అంటు తోటి కంటెస్టెంట్స్ తో చెప్పుకున్నాడు.ఆ తర్వాత దేబ్జానీ, నరేశ్ మధ్యసాగుతున్న కోల్డ్ వార్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు రామ్ ప్రసాద్.
ఆ తర్వాత బిగ్ బాస్ ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ మొదలుపెట్టాడు. ఇంటి సభ్యుల్ని రెడ్, ఎల్లో, గ్రీన్ లెవెల్ గా విడగొట్టాడు. ఆటతీరు, ఓటింగ్ ని బట్టి రెడ్ లెవెల్ లో ఝాన్సీ, రామ్ ప్రసాద్, రోహిత్, శ్వేత, సుధీర్, ఆర్కే, షాలినీ, వంశీ ఉన్నారు. ఎల్లో లెవెల్ లో త్రిగుణ్, నరేష్, వర్షిణి, ముఖేష్, దేబ్జానీ, అమన్, శివకుమార్ ఉన్నారు. ఎల్లో ఉన్నవాళ్లు గ్రీన్ కి వెళ్లేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. రెడ్ నుంచి ఎల్లో కి వెళ్లడానికి డెస్టినీ బాక్స్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. సర్కిల్ లో ఉన్న బోన్ ని దక్కించుకుని బాక్స్ లు బ్రేక్ చేయాలి. ఎల్లో కలర్ వస్తే ఎదుటి టీమ్ నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేయొచ్చు. బ్లూ వస్తే ఎవ్వరిని ఎలిమినేషన్ చేయడానికి వీల్లేదంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్క్ లో సుధీర్, ఝాన్సీ, శ్వేత గాయాలు అయినా తెగించి ఆడారు. చివరి రౌండ్ వరకు ఝాన్సీ, రామ్ ప్రసాద్ పోరాడగా ఫైనల్ గా రామ్ ప్రసాద్ విజయం సాధించి రెడ్ నుంచి ఎల్లో లెవెల్ కి చేరుకున్నాడు.




.webp)

