Home

»

Tv News

Podharillu : ప్రతాప్ వర్సెస్ చక్రి ఓపెన్ ఛాలెంజ్.. నారాయణ ఇంట్లో హై డ్రామా!

May 22, 2026 10:11AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -119 లో..... మహా సర్టిఫికెట్స్ భూషణ్ తీసుకుంటాడు. దాంతో భూషణ్ తలని టేబుల్ పై పెట్టి చంపేస్తానని చక్రి బ్లాక్ మెయిల్ చెయ్యడంతో తన ఫ్రెండ్ కి చెప్పి మహా సర్టిఫికెట్స్ ఇస్తాడు భూషణ్. సర్టిఫికేట్స్ చెక్ చేసుకున్న మహా ఉన్నాయని చెప్పగానే భూషణ్ ని వదిలేస్తాడు చక్రి. నిన్ను వద్దనుకుంటున్నా.. ఎందుకు తన వెంటపడుతూ ఇబ్బంది పెడుతాన్నావ్.. మహా నాది అని భూషణ్ తో చక్రి అనగానే మహా షాక్ అవుతుంది. ఆ తర్వాత నా సర్టిఫికెట్స్ తీసుకుంటావా అని భూషణ్ చెంపచెల్లుమనిపిస్తుంది మహా. ఆ తర్వాత మహా, చక్రి బయటకు వస్తారు. చక్రి వంక మహా కోపంగా చూస్తుంది. ఏంటండి అలా చూస్తున్నారని చక్రి అడుగుతాడు. ఏం అన్నానో గుర్తు లేదని చక్రి అనగానే గుర్తుతెచ్చుకోండి అని మహా అంటుంది. మహా నాది అన్న విషయం గుర్తుచేసుకొని ఏదో ఫ్లోలో అన్నానని చక్రి అంటాడు. అలా అనడం అవసరమా అని మహా కోప్పడుతుంది.

అక్కడ నుండి ఇద్దరు బయల్దేరతారు. మహా డల్ గా ఉంటుంది. ఇది కాకపోతే వేరే జాబ్ దానికే ఎందుకు అలా డల్ గా ఉంటారని చక్రి అంటాడు. జాబ్ వచ్చిందని ఆల్రెడీ స్వీట్ పంచానని మహా అంటుంది. అవన్నీ ఏం పట్టించుకోకు అని చక్రి చెప్తాడు.ఇంటికి వచ్చాక చక్రికి మహా కొంత డబ్బు ఇస్తుంది. చాలా థాంక్స్ అండి.. మీ పనులు మానుకొని నా కోసం వచ్చారని మహా అంటుంది. మరొకవైపు కేశవ దగ్గరికి శైలు వస్తుంది.  నువ్వు నాతో రీల్స్ చేస్తే నువ్వు ఫేమస్ అవుతావని కేశవతో శైలు అనగానే పక్కకి వెళ్లి ఆడుకోమ్మా అని కేశవ చిరాకుపడుతాడు. ఆ తర్వాత మహా డల్ గా ఉంటుంది. అప్పుడే మాధవ వచ్చి జాబ్ ఏమైందని అడుగుతాడు. చక్రి జరిగింది మొత్తం చెప్తాడు. వాడికి బుద్ది చెప్పి ఉండాల్సిందని కేశవ అంటాడు. ఆ తర్వాత ప్రతాప్ ఇంకా తన ఫ్రెండ్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తారు. నాకు తెలిసిన డ్రైవర్ కి ఫోన్ చేసానని అతను అనగానే ప్రతాప్ సరే అంటాడు. తీరా చూస్తే అక్కడికి చక్రి వస్తాడు. ఇతను చాలా నమ్మకమైన డ్రైవర్ అని చక్రి గురించి గొప్పగా చెప్తాడు అతడు. నాకు నచ్చలేదని ప్రతాప్ అంటాడు. అయిన ఫ్రెండ్ బలవంతం మీద చక్రి కార్ ఎక్కుతాడు ప్రతాప్.

ఈ అబ్బాయి చాలా మంచోడురా అని అతను అంటాడు. అందరు ముంచేవరకు తెలియదని ప్రతాప్ అంటాడు. ఒక డ్రైవర్ ఎవరో.. అలా చేసాడని అందరు అలాగే చేస్తారా అని అతను అంటాడు. ప్రతాప్ ఫ్రెండ్ ఇల్లు వచ్చాక ఆయన దిగిపోతాడు. ప్రతాప్ కి కోపం వచ్చి కార్ ఆపమంటాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మీరు ఏం చేసినా.. మీ ఇంటి మహాలక్ష్మి మా ఇంట్లో ఉందని చక్రి అంటాడు. నా కూతురిని నా ఇంటికి రప్పించుకుంటానని ప్రతాప్ అనగానే ఆ ఛాన్స్ లేదు.. అసలు రాదని ప్రతాప్ అంటాడు. నా కూతురిని వారం రోజుల్లో నా ఇంటికి వచ్చేలా చెస్తానని ప్రతాప్ అంటాడు. అది జరగదని చక్రి అంటాడు. ఇక ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు. తరువాయి భాగంలో  నారాయణ వాళ్ళ ఇంటికి ప్రతాప్ వెళ్తాడు. నారాయణ పక్కన కూర్చొని ప్రతాప్ మాట్లాడతాడు. అప్పుడే చక్రి వస్తాడు. అమ్మా మహా.. అల్లుడు గారు వచ్చారని ప్రతాప్ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com