.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1150 లో...దాగుడుమూతలు ఆడుతూ సిరి కనిపించకుండా పోవడంతో రాజ్, ఇందు తెగ కంగారుపడతారు. ఇంట్లో, గార్డెన్ లో, వీధిలో ఎంత వెతికినా సిరి దొరకదు. దీని వెనుక రేఖ హస్తం ఉందని రాజ్ అనుమానిస్తాడు. పిన్నీ సిరి ఎక్కడ, నీకే తెలుటూ రేఖను నిలదీస్తాడు. రేఖ మాత్రం నాకేం తెలీదు, కావాలంటే పోలీసులను పిలిపించమని ఎదురు సవాల్ చేస్తుంది.
రాజ్ కోపంతో పోలీసులకు ఫోన్ చేయబోతుంటే ఇందు అడ్డుకుని గదిలోకి తీసుకెళ్తుంది. పోలీసులు వస్తే నీ యాక్సిడెంట్ నిజం బయటకు వస్తుంది. అందరికి ప్రాబ్లం అవుతుందని ఇందు హెచ్చరిస్తుంది. అప్పుడు ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలని ఐడియా ఇస్తుంది. ఫోన్ లో ఫుటేజ్ చూస్తే సిరి పొరపాటున ఓ క్యాబ్ డిక్కీలో దాక్కోవడం..ఆ క్యాబ్ వెళ్లిపోవడం కనిపిస్తుంది. అది ఆన్ లైన్ ట్రావెల్ సర్వీస్ క్యాబ్ అని గుర్తించి, దానిపై ఉన్న నంబర్ కు ఫోన్ చేసి డ్రైవర్ డీటెయిల్స్ తెప్పించుకుంటారు రాజ్, ఇందు.
మరోవైపు కారు డిక్కీలో నుంచి దిగిన సిరి సిటీ ఔట్ స్కర్ట్స్ లో ఒంటరిగా మిగిలిపోతుంది. మా ఇంటికి తీసుకెళ్లు, నా మొగుడి దగ్గరకు తీసుకెళ్లమని డ్రైవర్ ని బతిమాలుతుంది. డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. ఆ డ్రైవర్ వెంటనే రేఖకు ఫోన్ చేసి.. మీరు చెప్పినట్లే ఆ అమ్మాయిని సిటీ బయట వదిలేశానని చెప్తాడు. రేఖ డబ్బులు పంపించి అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది అంటూ కుట్ర పన్నుతుంది. రోడ్డు మీద.. మొగుడా, మొగుడా అంటూ భయంతో తిరుగుతున్న సిరిని బైక్ వాళ్లు, ఆటో డ్రైవర్లు పట్టించుకోకుండా వదిలేస్తారు.
తరువాయి భాగంలో ఓ ఆటో డ్రైవర్ సిరి దగ్గరకు వచ్చి.. నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి ఆటో ఎక్కించుకుంటాడు. దారిలోనే ఎవరికో ఫోన్ చేసి.. కత్తిలాంటి అమ్మాయి దొరికింది, మన ప్లేస్ కి తీసుకొస్తున్నానని అంటాడు. సిరిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ముగ్గురు కామాంధులు అత్యాచారయత్నం చేయబోతారు. అదే సమయంలో రాజ్, ఇందు క్యాబ్ డ్రైవర్ చెప్పిన లొకేషన్ కు వెళ్లి సిరి కోసం జల్లెడ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
