
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1157 లో.....రేఖ, ఐశ్వర్యల గురించి సుభాష్, అపర్ణ భయపడుతుంటారు. వాళ్లకు కంపెనీ పెట్టించారు, ఇప్పుడు వాళ్లు ఆస్తి మొత్తం లాగేసుకోవడానికి రెడీ అవుతారని అంటే.. రాజ్, ఇందు తాము ఉండగా అలా జరగదని.. కంపెనీ పెట్టించిన మేమే కంపెనీ ఎప్పుడు తీసుకోవాలో తెలియదా అంటూ ఓదారుస్తారు. అంతా తాము చూసుకుంటామని రేఖ ఆటలు సాగనివ్వమని ముందు ఐశ్వర్య, లక్కీల పెళ్లి చేయాలని చెప్తారు రాజు, ఇందు.
రేఖ, భ్రమరాంబ సంబరపడిపోతుంటారు. నేను ముందే చెప్పాను కదా లక్కీ, ఐశ్వర్యల పెళ్లి జరిగినా జరగకపోయినా మనకు లాభమే జరుగుతుందని ఇదిగో ఈ అగ్రిమెంట్ అడ్డుపెట్టుకుని ఆస్తిని ఎలా లాగేసుకుంటానో చూడండి అంటుంది. అందుకు శేషు అడ్డుపడతాడు. ఈ అగ్రిమెంట్ అడ్డుపెట్టుకుని ఆస్తి లాగేసుకోవడం అనేది మీ భ్రమ, అందుకే మీరు ప్రతీసారి ఫెయిల్ అవుతున్నారు. ముందు లక్కీ, ఐశ్వర్యల పెళ్లి జరగాలి తర్వాత కంపెనీ ఐశ్వర్య చేతుల్లోకి వెళ్తుందని చెప్పగానే.. ఐశ్వర్య చేతిలో ఉన్నా, రేఖ చేతిలో ఉన్నా ఒక్కటే అంటూ చెప్పగానే అలా జరగదు అంటుంది రేఖ. ఎందుకు జరగదు.. ఇందు విషయంలో ఏం జరిగిందో చూశాం కదా ఇప్పుడు ఐశ్వర్య కూడా అలా చేయదని ఏం గ్యారంటీ అంటూ భూషణ్ ప్రశ్నిస్తాడు.
ఐశ్వర్య తన కంపెనీ గురించి లోగో గురించి ఎలా బిజినెస్ లో నెంబర్ వన్ గా ఎదగాలనే విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే లక్కీ వెళ్తాడు. ఎందుకొచ్చావని ఐశ్వర్య అడిగితే.. భార్య దగ్గరకు భర్త ఎందుకు వస్తాడమ్మా అంటాడు లక్కీ. మనకి ఇంకా పెళ్లి కాలేదు.. నా దగ్గరకు వచ్చి ఓవర్ చేయకు ముందు రూంలోంచి వెళ్లిపో, నిన్ను పెళ్లి చేసుకుంటేనే నన్ను కంపెనీకి ఓనర్ ని చేస్తానంది ఇందు.. అందుకే ఒప్పుకున్నాను అంటుంది. అందుకు అయితే మన పెళ్లిని ఒక డీల్ లా చూస్తున్నావా.. మరి పెళ్లి అయ్యాక నా పరిస్థితి ఏంటి అంటే.. ఏం లేదు పుట్టబోయే బిడ్డకు తండ్రివి, నాకు భర్త పాత్రలో ఉండే వ్యక్తివి అంటూ ఐశ్వర్య చెప్తుంది.
రాజు, ఇందుతో లక్కీ, ఐశ్వర్యల గురించి మాట్లాడతాడు. పెళ్లయ్యాక కంపెనీ పెట్టించాక ఐశ్వర్య మారిపోయి లక్కీకి విడాకులు ఇస్తే వాడి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే.. ఏం జరగదు, ఐశ్వర్య తల్లి అయ్యాక అంతా మారిపోతుందని ఇందు చెప్తుంది. ఇక ఐశ్వర్య, రేఖ దగ్గరకు వెళ్లి లక్కీ తన రూంకు వెళ్లి పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేశాడని చెప్పగానే ఇదంతా ఇందు ప్లాన్ అంటూ ఐశ్వర్యను రేఖ రెచ్చగొడుతుంది. దాంతో ఐశ్వర్య తాను కంపెనీకి ఓనర్ అయ్యాక దుగ్గిరాల కంపెనీలను స్మాష్ చేస్తానని చెప్తుంది. కానీ రాజు అడ్డుపడతాడేమోనని చెప్తే.. వాడిని ఇంట్లోంచి పంపించేందుకు ప్లాన్ చేశానంటూ రేఖ ఎవరికో ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లమని చెప్తుంది. నందు పోలీస్ గాఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
