.webp)
సర్కార్ షోలో హోస్ట్ సుధీర్ కి రామ్ ప్రసాద్, అవినాష్, రోహిణి, రాకెట్ రాఘవ కలిసి సన్మానం చేశారు. అవినాష్ ఐతే ఒక సన్మాన పత్రం కూడా రాసుకొచ్చాడు. అది చదువుతున్నంత సేపు సుధీర్ భయపడ్డాడు, బాధపడ్డాడు. ఇక రామ్ ప్రసాద్ సుధీర్ కోసం సన్మానం పోస్టర్ ని కూడా డిజైన్ చేసి చూపించాడు. "సుధీర్ అది ఒక పేరు కాదు డోలు. ఈయన పొదల్లో ఉదయించిన సూర్యుడు.
చిన్నప్పుడు ఉంగా ఉంగా అన్నాడు. కానీ ఇప్పుడు గెలుపు కోసం బెంగా బెంగా అంటున్నాడు. పేకల నుంచి అభిమానుల కేకల దాకా అన్ని చూసారు. ఆయనకు అలుపు లేదు...ఆయన్ని ఆప్ తలుపు లేదు. ఆయన ఎల్లకాలం బాగుండాలని కోరుకుంటూ సుధీర్ ఆల్ ది బెస్ట్" అని చెప్పాడు. ఐతే సుధీర్ ఫుల్ గా మోసం చేశారు. పూలు దండాలు తెచ్చి ఎవరికీ వాళ్ళు వేసుకున్నారు.
ఈ స్కిట్ ఇంత బాగా రాసావు అంటూ రాంప్రసాద్ కి పూల దండ వేసింది రోహిణి. ఎవరికీ వాళ్ళు పూలు జల్లేసుకుని వాళ్ళను వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు. అమ్మ సుధీర్ నువ్వు ఒక్కడివే సెల్ఫీ తీసుకో అంటూ రాంప్రసాద్ ఆట పట్టించాడు. "నా ఫ్రెండ్స్ వాళ్లంతా వాళ్లను నువ్వు కొనేసి నా మీద ఇలా చేయిస్తావా " అంటూ సుధీర్ విష్ణుప్రియను అడిగాడు ఫన్నీగా. ఇక విష్ణు ప్రియా ఐతే ఇంతా అవిమానించిన వాళ్ళను ఊరుకోను అంటూ చెప్పింది.




.webp)
.webp)
