.webp)
అన్న అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. ఆయన ఆజానుబాదుడు. ఆయన అచ్చమైన తెలుగులో మాట్లాడుతూ ఉంటె వినేకొద్దీ వినాలనిపిస్తుంది. అలాంటి ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన ఒక జర్నలిస్ట్ తన అనుభవాన్ని ఎన్టీఆర్ కోపాన్ని అలాగే శాతాన్ని కూడా తన మాటల్లో సర్కార్ సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్ లో షేర్ చేసుకున్నారు జర్నలిస్ట్ మూర్తి. "1989 - 90 లో మర్చిపోలేని ఇసిడెంట్ జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇంటర్వ్యూ చేయాలని కోరిక నాకు. 5 గంటలకు రండి అన్నారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ని ఓడించండి అనాలి కదా కాంగ్రెస్ కి ఓటేయండి అన్నారు పాపం ఆయన.
నేను ఏదైతే పత్రికలో పని చేస్తున్నానో ఆ పత్రిక ఫ్రంట్ పేజీలో కాంగ్రెస్ కి ఓటేయండి...ఎన్టీఆర్ పిలుపు అనే హెడ్డింగ్ తో వార్త పెట్టా. నేను ఇంటర్వ్యూకి వెళ్లేసరికి ఆయన పేపర్స్ అన్నీ చదివేసారు. ఆయన కోపంతో లేచి పొమ్మనండి ఆడికి నేను ఇంటర్వ్యూ ఇవ్వను అన్నారు. ఏమనుకుంటున్నారు నా గురించి ఎం మాట్లాడుతున్నారు ? ఎంత కోపంతో రావాలో అంత కోపంతో అరిచారు. అంతా ఐపోయాక కూల్ గా ఒక్కటే అన్నాను. మేనేజ్మెంట్ , రాజకీయాలు ఇవన్నీ నాకు తెలీవు. నాకు కావాల్సింది మీ ఇంటర్వ్యూ అన్నాను. అప్పుడు అర్ధమయ్యింది.
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అని ఆయన్ని ఎందుకు అంటారో. అప్పటి వరకు అంతెత్తు మనిషి కోపంతో ఎర్రగా కందిపోయిన మనిషిని చూసిన నేను రెండు సెకన్లలో నేల మీదకు వచ్చేసి అడగండి మీకేం కావాలో అన్నారు. అరగంట మాట్లాడి నేను వచ్చేస్తుంటే ఉండండి బ్రదర్ ఎవరక్కడ బ్రదర్ కి నాకు ఫోటో తీయండి అన్నారు. అది కూడా ఫోటోని ఎలా తీయాలో డైరెక్షన్స్ కూడా ఆయన చెప్పారు. ఇది నాకు మర్చిపోలేని సంఘటన నాకు " అని చెప్పారు విఎస్ఎన్ మూర్తి.





.webp)
