.webp)
సరిగమప షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కి హరీష్ శంకర్ వచ్చారు. ఇక ఇమ్మానుయేల్ వచ్చి చందాలు అడగడం స్టార్ట్ చేసాడు. "దసరాకు చందాలు " అంటూ అడిగాడు. "దేవుడు మనకు ఇస్తాడయ్యా మనం దేవుడికి ఇవ్వడం ఏంటి" అన్నారు హరీష్ శంకర్. "ఏకంగా పర్సు ఇచ్చేస్తున్నాను తీసుకో" అన్నారు. వెంటనే ఆ పర్సు తీసుకుని ఇందులో డబ్బులు లేవేంటి సర్" అన్నాడు ఇమ్ము. "పర్సు ఇస్తానన్నాను డబ్బులు ఎప్పుడు ఇస్తా అన్నాను " అన్నారు. "పర్సు పాతిక వేలు ఉంటుంది వెళ్లి పండగ చేసుకో" అన్నారు.
వెంటనే అనిల్ రావిపూడి లైన్ లోకి వచ్చి "ఈ పర్సు ని 15 వేలుకు అమ్మితే 50 వేలు ఇస్తా" అంటూ ఇమ్ము మార్కెటింగ్ స్కిల్స్ మీద ఒక టాస్క్ ఇచ్చారు. వెంటనే ఇమ్ము ఆ పర్సు తీసుకుని శైలజమ్మ దగ్గరకు వెళ్లి "మంచి క్వాలిటీ చింపిన చిరగదమ్మా . ఆఫర్ నడుస్తోందమ్మా. ఎర్రగడ్డమ్మా " అన్నారు. తర్వాత మ్యూజిక్ బ్యాండ్ దగ్గరకు వెళ్లి ఈ పర్సుని గొడుగులాగా కూడా వాడుకోవచ్చు అంటూ మార్కెటింగ్ చేసాడు. ఇక ఫైనల్ గా ఆ పర్సును తీసుకుని హరీష్ శంకర్ కాళ్ళ దగ్గర కూర్చుని బస్సు ఎక్కడ తిరిగినా చివరికి డిపో దగ్గరకే రావాలి కదా ..జస్ట్ 25 వేలే కొంటారా సర్ అంటూ అతని పర్సుని అతనికే అమ్మే ప్రయత్నం చేసాడు." ఇమ్మానుయేల్. దాంతో అందరూ నవ్వేశారు.
ఇక ప్రోమో స్టార్టింగ్ లో "అనిల్ ఇండస్ట్రీలో నేను నీకు సీనియర్ ఐనా ఈ ప్రోగ్రాంలో నువ్వే సీనియర్ వి. సంక్రాంతికి వంద మంది వంద టైటిల్స్ పెట్టారు. కానీ ఇవ్వాళా నేను బాప్ ఆఫ్ టైటిల్ పెట్టబోతున్నా. అనిల్ సంక్రాంతి గబ్బర్ సింగ్ అంటూ పోస్టర్ వేసేసరికి అందరూ షాకైపోయారు.




.webp)

