Home

»

Tv News

2027లో అది నిజం కావాలి.. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ మధ్య ఇంటరెస్టింగ్ డిస్కషన్

Oct 23, 2026 3:12PM

సరిగమప లేటెస్ట్ ఎపిసోడ్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. అందులోనూ హరీష్ శంకర్ గెస్ట్ గా వచ్చారు. ఇక పూర్వాంకర్ - శ్రేయ కలిసి మిరపకాయ్ మూవీలోని  "దినకు జిన్ " అనే సాంగ్ పాడి అందరితో శబాష్ అనిపించుకున్నారు. ఈ సాంగ్ గురించి ఈ మూవీ డైరెక్టర్  హరీష్ శంకర్ ఆయన అభిప్రాయాన్ని చెప్పారు. " ఇది మా బావ పాట . నేను దీని గురించి మీకు చెప్పాలి. ఇందులో హీరోయిన్ ఒక క్లాసికల్ సింగింగ్ ఫామిలీ నుంచి వచ్చే హీరోయిన్ . అమ్మాయి ఫాదర్ సినిమాలో సంగీత విద్వాంసులు. అందుకే కొంచెం క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్ కావాలి బావా అని అడిగాను  థమన్ ని. ముందు ఇది ఏ ఫేజ్  లో ఏ రిథమ్ లో ఉండాలి అని ఒక టెంపో ఫిక్స్ చేసాం . ఆ రిథమ్ ప్లే అవుతూ ఉంటే థమన్ నాన్  స్టాప్ గా గంటన్నర పాటు ఆపకుండా ఒక ఏడెనిమిది ట్యూన్స్ పాడుతూనే ఉన్నాడు. ఒక్క చోటు య కారంతో ఒక ట్యూన్ పాడి బావా ట్యూన్ వచ్చేసింది అని చెప్పాడు. మిరపకాయ్ మూవీ సక్సెస్ కి ఈ సాంగ్ చాలా ప్లస్ అయ్యింది. " అని చెప్పారు.

తర్వాత అనిల్ రావిపూడి కూడా మాట్లాడారు. "ఒక సినిమాలో హిట్ సాంగ్స్ తెచ్చుకోవడం డైరెక్టర్స్ కి చాలా కష్టం. అలాంటిది ఉన్న పాటలన్నీ అద్భుతంగా చేయించుకునే డైరెక్టర్స్ లో టాప్ లిస్ట్ లో ఉండేది హరీష్ అన్నా. హరీష్ అన్న విషయంలో నాకు చిన్న జెలస్ ఉంది. ఎప్పటికైనా మనం కూడా ఆరుకు ఆరు కొట్టే పాటలు తెచ్చుకోవాలని " అన్నారు. దాంతో హరీష్ శంకర్ కూడా కౌంటర్ వేశారు. "ఆరు సంక్రాంతులు కొట్టేవాడికి ఆరు పాటలు కొట్టడం ఒక పనా" అన్నారు. వెంటనే అనంత  శ్రీరామ్ " 2027 లో అది నిజం కాబోతోందని నేను అనుకుంటున్నాను " అన్నారు. "తధాస్తు " అన్నారు హరీష్ శంకర్.
రీసెంట్ గా జ్యోతి పూర్వాజ్ నటించిన కిల్లర్ మూవీ సక్సెస్ సాధించాలని ఆమెకు మంచి గుర్తింపు రావాలని ఆయన కోరుకున్నారు.  
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com