సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి 7 ఆర్ట్స్ సరయు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన యాస, భాష, బోల్డ్ డైలాగులు, విభిన్నమైన ప్రవర్తనతో యువతలో మంచి గుర్తింపు సంపాదించుకున్న సరయు.. తన మాటలు, చేతలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తనపై ఎన్ని విమర్శలు, ట్రోలింగ్ వచ్చినా తాను చెప్పాలనుకున్న విషయాలను నిర్భయంగా చెప్పడం ఆమె ప్రత్యేకత. అలాంటి సరయు ఇప్పుడు అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
సరయు రాయ్ తన పెళ్లి విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. పెళ్లి దుస్తుల్లో ఉన్న సరయును ఆమె తల్లి ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశారు. మరో ఫొటోలో ఓ వ్యక్తి చేయి పట్టుకుని నడుస్తూ కనిపించారు. అయితే తన భర్త ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు . దీంతో సరయును పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరనే ఆసక్తి నెటిజన్లలో మొదలైంది. తన పెళ్లి గురించి సరయు పెట్టిన పోస్ట్‌లో ఆధ్యాత్మికత, తల్లిపై ప్రేమ స్పష్టంగా కనిపించాయి. ‘‘ఎప్పటికీ అమ్మ కూతురిగానే ఉంటాను. ఇప్పుడు నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇది సాక్షాత్తూ మహాదేవుడే నా కోసం రాసినదని నమ్ముతున్నాను. కొన్ని ఆశీర్వాదాలు మాటల్లో చెప్పలేనంత పవిత్రమైనవి. కొన్ని ఆరంభాలకు ప్రత్యేకమైన ప్రకటనలు అవసరం లేదు. అంతులేని విశ్వాసం, అమ్మ ప్రేమ, మహాదేవుని అనుగ్రహం ఉంటే చాలు. హర్ హర్ మహాదేవ్’’ అంటూ ఎమోషనల్ పోస్ట్ ని రాసుకొచ్చారు. ఐతే పెళ్లి కొడుకు ఎవరు అన్నది రివీల్ చేయకపోయేసరికి ఫాన్స్ అంతా విషెస్ చెప్తూ ఆ లక్కీ పర్సన్ ఎవరు అంటూ అడుగుతున్నారు.
సరయు రాయ్ తెలుగు బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్లో నెగిటివ్ రోల్ లో నటించారు. ఆ తర్వాత ‘7 ఆర్ట్స్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి బోల్డ్ కామెడీ వీడియోలతో యువతకు దగ్గరయ్యారు. ‘పతివ్రత’, ‘సరయు క్లినిక్’, ‘డాక్టర్ సరయు’, ‘ఎస్ఐ సరయు’, ‘సరయు పెళ్లమైతే’, ‘ఆకలి రాజ్యం’, ‘చూడాలని ఉంది’ వంటి వీడియోలతో సోషల్ మీడియాలో గుర్తింపు సంపాదించుకున్నారు. తనదైన కామెడీ శైలి, బోల్డ్ డైలాగులు, యాసతో ఆడియన్స్ ని ఆకర్షించారు. సినిమా రివ్యూలను కూడా తన ప్రత్యేకమైన శైలిలో చెబుతూ అభిమానులను సంపాదించుకున్నారు. యూట్యూబ్‌లో వచ్చిన గుర్తింపుతోనే సరయుకు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొనే అవకాశం దక్కింది. అయితే మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఓటీటీ ‘నాన్‌స్టాప్’లోనూ పార్టిసిపేట్ చేశారు . ఈ రెండు సందర్భాల్లోనూ తొలి వారంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం యూట్యూబ్ కంటెంట్‌తో పాటు సినిమాల్లోనూ నటిస్తూ తన కెరీర్‌ను కొనసాగించారు.
ఇక గతంలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన సరయు.. ఓ వ్యక్తితో ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్నట్లు వెల్లడించారు. ఆ బంధం పెళ్లి వరకు వెళ్లినా, కట్నం విషయంలో విభేదాలు రావడంతో వివాహం రద్దు చేసుకున్నట్లు చెప్పారు. తన మాటల్లోనే చెప్పాలంటే, మొదట ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైనప్పటికీ, లాస్ట్ లో అవతలి కుటుంబం కట్నం కోసం డిమాండ్లు రావడం అలాగే మొదట రూ.25 లక్షలు అడిగి, ఆ తర్వాత రూ.50 లక్షలు, కోటి రూపాయల వరకు డిమాండ్ చేశారని, ఆస్తిలో సగం వాటా కూడా కోరారని తెలిపారు. పెళ్లికి ముందే ఇన్ని కండిషన్స్ పెడితె తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచించి ఆ సంబంధాన్ని వద్దనుకున్నట్లు చెప్పారు.
ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే రామ్ చరణ్ లాంటి వ్యక్తిని చేసుకుంటానని సరదాగా తన మనసులో మాటను వెల్లడించారు. ఇప్పుడు సరయు పెళ్లి చేసుకుని ఫాన్స్ కి షాక్ ఇచ్చారు. ఇక నటి ప్రియా, ప్రియాంక సింగ్ వంటి వాళ్లంతా విషెస్ చెప్తున్నారు.
[sarayuu, marriage, 7 arts, big boss nonstop, brekap, love]




