.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -216 లో....రుద్రకి నాపై డౌట్ వచ్చింది. నా గురించి నిజం తెలిసినట్లు ఉంది కానీ నాకు తెలిసిందని అతనికి తెలియదని ఇషికతో వీరు అంటాడు. మరొకవైపు నాకు అతనికి గురించి తెలియలేదని అనుకుంటున్నాడు కానీ నాకు అంతా తెలుసు అన్న విషయం వీరుకి తెలియదని గంగతో రుద్ర అంటాడు. గంగ దగ్గరికి రంగా వస్తాడు. ఈ రోజు మన బస్తీ దగ్గరికి వెళ్ళాను.
అక్కడికి వెళ్లినంతసేపు మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తువచ్చాయి కానీ నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండే దానివో అర్థం అవడం లేదు. ఒకసారి చిన్నప్పటి ఫోటో చూపించమని రంగా అనగానే గంగ చూపిస్తుంది. అందులో గంగ అమ్మనాన్న లతో ఉంటుంది. రంగా అంతకు ముందు చూసిన ఫోటోలో గంగ వెనకాల తన పేరెంట్స్ స్థానంలో వేరే ఉన్నారు ఎవరని రంగాకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత గంగకి లక్ష్మి ఫోన్ చేసి రంగా వచ్చాడు కానీ మేమ్ సరిగ్గా మాట్లాడలేదు. ఏం అన్నాడని అడుగుతుంది. నా చిన్నప్పటి ఫోటో చూపించమని చెప్పాడు. చూపించానని గంగ చెప్తుంది. ఆ తర్వాత లక్ష్మీ, పైడిరాజు టెన్షన్ పడతారు. రంగాకి డౌట్ వచ్చింది. గంగకి నిజం తెలియకముందే మనం చెప్తే బెటర్ అని పైడిరాజు అనగానే ఇన్ని రోజులు చెప్పలేదని మనల్ని అసహ్యించుకుంటుందని లక్ష్మి అంటుంది.
ఆ తర్వాత ఇందుమతి బిజినెస్ ఉమెన్ లాగా రెడీ అవుతుంది. తనని చూసి స్నేహ, వంశీ, సూర్య, రాఘవ షాక్ అవుతారు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తూ బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు. బిజినెస్ నేనే చూసుకుంటాను. ఎందుకంటే మావయ్యకి సూర్యకి హాఫ్ నాలెడ్జ్ అని ఇషిక అనగానే ఇందుమతికి కోపం వస్తుంది. రేపటి నుండి నా భర్త, సూర్య ఆఫీస్ కి వెళ్తారని ఇందుమతి చెప్తుంది. సూపర్ మార్కెట్ లో చాలా కష్టపడ్డావ్ అక్క నేనే వడ్డీస్తాను.. మీరు కూర్చోండి అని ప్రమీలతో గంగ అంటుంది. తరువాయి భాగంలో ప్రమీల తన జీవితం మళ్ళీ మొదలు పెట్టాలని నేను, రుద్ర సర్ అనుకున్నామని ప్రమీలతో గంగ చెప్పగానే ప్రమీల షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







