Home

»

Tv News

33 ఏళ్లకు ఫైనల్లీ సోల్‌మేట్ దొరికాడు.. పెళ్లి వార్తతో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన రౌడీ రోహిణి!

Oct 9, 2026 10:15AM

రౌడీ రోహిణి , లేడీ కమెడియన్ రోహిణి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. రోహిణి ఏది చేసిన కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. జబర్దస్త్ లో, శ్రీదేవి డ్రామా కంపెనీలో, ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఇలా ఒక్కటేమిటి రోహిణి కనిపించని ప్రోగ్రాం అంటూ ఏదీ లేదు. అలాంటి రోహిణి రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టింది. ఐతే కొన్నేళ్లుగా రోహిణి తన పెళ్లి కోసం ఎదురు చూపులు చూస్తోంది. మంచి అబ్బాయి కావాలని కోరుకుంటోంది. ఎందుకంటే రోహిణి 33  ఏళ్ళ వయసు వచ్చేసింది. ఈ విషయాన్ని మొన్నటి ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ఒక బుట్ట టాస్క్ లో చెప్పేసింది. "ఈ సంవత్సరం ఎలాగైనా నా పెళ్ళైపోవాలి... వరమాల నా మేడలో పడిపోవాలి " అంది.

అలాంటి రోహిణి నిజంగానే వరుడిని వెట్టుకునే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టింది. అద్దిరిపోయే పింక్ కలర్  కాస్ట్యూమ్ లో రోహిణి తలదించుకుని ఒక అబ్బాయి చేయి పట్టుకుని నిలబడిన ఫోటోని షేర్ చేసింది. అలాగే ఒక కాప్షన్ పెట్టింది "ఫైనల్లీ అనుకున్నది జరుగుతోంది. నా సోల్ మేట్ దొరికాడు " అంటూ డిసెంబర్ అని రాసి పక్కన ఫ్లవర్ ఎమోజిస్ ని కూడా పెట్టుకుంది. దాంతో నెటిజన్స్ అంతా కంగ్రాట్యులేషన్స్ అని రిప్లైస్ ఇస్తున్నారు. ఇంతకు ముందు ఒక ఏఐ అబ్బాయి పిక్ ని చూపించి ఇతనే మా ఆయన అని కూడా పోస్ట్ పెట్టింది. ఇప్పుడు అబ్బాయి ముఖం చూపించకుండా అబ్బాయి చేతి మీద తన చేతిని వేసి సిగ్గుపడుతూ నిలబడింది. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా నిజమా అబద్దమా అనుకునే లోపే ఫాన్స్ ని నిరాశలో పడేసింది రోహిణి. ఆ పిక్ పెట్టిన కాసేపటికే దాన్ని డిలీట్ చేసి "సారీ గైస్ ... ఒక షోలో అది ప్రాంక్ ... లవ్ యు ఆల్ " అని మరో స్టేటస్ పెట్టేసింది.
-----------

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com