
బిగ్ బాస్ 10 తెలుగు ప్రధాన షోలోకి కామనర్స్ ఎంట్రీ ఇవ్వడానికి నిర్వహించే ప్రీ షో 'అగ్నిపరీక్ష'. కఠినమైన టాస్క్‌లతో కామనర్స్‌ను పరీక్షిస్తున్నారు. టాప్ 15 కామనర్స్‌లో టఫ్ ఫైట్ ఇస్తున్న వారిలో విజయవాడకు చెందిన రోహిత్ నాయుడు పట్నం ఒకరు.రోహిత్ నాయుడు ఏపీలోని విజయవాడకు చెందిన వ్యక్తి. ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా పనిచేస్తున్నాడు. మోడలింగ్, యాక్టింగ్ పట్ల ఉన్న ఆసక్తితో బిగ్ బాస్ కామనర్ కాంటెస్ట్ 'అగ్నిపరీక్ష'లో పాల్గొన్నాడు. రోహిత్ ఇన్‌స్టాగ్రామ్‌లో (@rohitnaidupatnam.official) చాలా యాక్టివ్‌గా ఉంటూ రీల్స్, షార్ట్స్, లైఫ్‌స్టైల్ కంటెంట్‌ను షేర్ చేస్తుంటాడు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎంట్రీతో ఇతనికి నెట్టింట ఫాలోయింగ్ భారీగానే పెరిగింది.
అగ్నిపరీక్ష జడ్జిలు అభిజిత్, బిందు మాధవి, నవదీప్ పెట్టిన కఠిన టాస్కుల్లో రోహిత్ పేషెన్స్ తో ఆకట్టుకున్నాడు. బిందు మాధవి ముఖంపై నీళ్లు కొట్టి రెచ్చగొట్టినా కూల్ గా ఉండి ప్రేక్షకుల ఓట్లు సంపాదించుకున్నాడు. సోషల్ మీడియా క్రియేటర్లు కూడా అతనికి సపోర్ట్ గా నిలిచారు. శ్రీముఖి "ఆత్మగౌరవం కోసం ఎందుకు ప్రశ్నించవు?" అని అడిగితే "నన్ను రెచ్చగొట్టేందుకే చేస్తున్నారు" అని కూల్ గా సమాధానమిచ్చాడు.
"నా చిన్నప్పుడే మా నాన్న మమ్మల్ని విడిచి వెళ్లినప్పుడు, జీవితం పూర్తిగా మారిపోయింది. నేను ఎన్నో కష్టాలను, బాధ్యతలను, నా బలాన్ని పరీక్షించే పరిస్థితులను ఎదుర్కొన్నాను. మా అమ్మ నాకు ఎప్పుడూ ఒక పాఠం నేర్పింది. ఏం జరిగినా సరే, నిన్ను నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు. ఆ మాటలే నాకు బలంగా మారాయి. దృఢంగా నిలబడటం, ప్రతి పోరాటంలో పోరాడటం, ముందుకు సాగుతూ ఉండటం అవి నాకు నేర్పించాయి. ఈ రోజు, నేను నేర్చుకున్న ప్రతి పాఠాన్ని, ప్రతి పోరాటాన్ని, ప్రతి త్యాగాన్ని గర్వంగా మోస్తున్నాను. జీవితం సులభంగా ఉండడం వల్ల నేను ఇక్కడ లేను. నాపై నాకు ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోనందువల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఇది నా ప్రయాణం. ఇది నా అగ్నిపరీక్ష. ఇది రోహిత్ నాయుడు" అని అగ్నిపరీక్ష స్టార్టింగ్‌లో రోహిత్ చెప్పాడు.
హౌస్ లోకి వచ్చాక రోహిత్ గేమ్ పూర్తిగా మారిపోయింది. అటు షాలినీతో లవ్ ట్రాక్ నడుపుతూ మరోవైపు అమన్, చరణ్, అపూర్వలని పప్పెట్ లాగా వాడుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. తాను లీడర్ గా ఉండి వాళ్లంతా తన మాట వినేలా చేస్తున్నాడు. నామినేషన్లలో ఎవరిని టార్గెట్ చేయాలి, ఎలా ఆడాలి అనేది తనే డిసైడ్ చేస్తున్నాడు. అయితే అగ్నిపరీక్ష నుండి వచ్చినవాళ్లంతా ఒక గ్రూప్ గా ఆడటం వారి మైనస్ అవుతోంది. ఆడియన్స్ కి గ్రూప్ గేమ్ నచ్చడం లేదు. ఇదే వారికి బిగ్ బాస్ లో మైనస్ పాయింట్ గా మారుతోందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని వారాలు చూడాల్సిందే.




.webp)

