.webp)
బిగ్ బాస్ ఏది అనుకుంటే అదే చేస్తుంది. సాధారణంగా ఆడియన్స్ ఓట్లను పరిగణనలోకి తీసుకుని ఎలిమినేషన్లు జరుగుతాయని భావిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో బిగ్ బాస్ టీం తమ వ్యూహాలకు అనుగుణంగా షోను నడిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 10లో రోహిత్ ఎలిమినేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్ ఎలిమినేషన్ వెనుక బిగ్ బాస్ టీం వ్యూహం ఉందనే అనుమానాలు వస్తున్నాయి . ముందుగా త్రిగుణ్‌కు ప్రత్యేకంగా ఓ వీడియో చూపించడం, దాంతో అతడు కోపానికి గురికావడం, ఆ తర్వాత అమన్, నరేష్, రామ్ ప్రసాద్, దేబ్జానీలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం వంటివి ప్లాన్ ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది . దీంతో వారంతా రోహిత్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసేసరికి , చివరకు అతడు ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. ఈ ఇష్యూస్ మీద గతంలో బిగ్ బాస్ విజేతగా నిలిచిన కౌశల్ తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. రోహిత్ ఎలిమినేషన్ చూసి తాను షాక్‌కు గురయ్యానని కౌశల్ చెప్పాడు. సాధారణంగా ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్లు జరుగుతుంటాయని, కానీ కంటెస్టెంట్ల ఓట్లతో ఒకరిని బయటకు పంపించడం చాలా అరుదుగా జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. తన సీజన్‌లో కూడా ఇలాంటి ఎలిమినేషన్ ప్రక్రియ పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నాడు. తన సీజన్‌లో రోహిత్‌కు కనీసం ఏడు ఓట్లు వచ్చి ఉండేవని, తనకు మాత్రం 15 ఓట్లు వచ్చేవని కౌశల్ చెప్పుకొచ్చాడు. అదే జరిగి ఉంటే తానే షో నుంచి బయటకు వెళ్లేవాడినని పేర్కొన్నాడు. బిగ్ బాస్ ఇంట్లో ఏదైనా జరగొచ్చని, ముఖ్యంగా ఈ పదో సీజన్‌లో ఎలాంటి పరిణామాలైనా చోటుచేసుకోవచ్చని ముందుగానే చెప్పారని గుర్తుచేశాడు. కాబట్టి ఈ విషయంలో బిగ్ బాస్ టీంను పూర్తిగా తప్పుపట్టలేమన్నాడు. తెలివైన కంటెస్టెంట్‌గా ఎదుగుతున్న వ్యక్తికి పోటీగా ఉన్న మరో కంటెస్టెంట్‌ను ఇలాంటి వ్యూహాలతో బయటకు పంపించడం బిగ్ బాస్‌లో కొత్తేమీ కాదని కౌశల్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ కూడా తన ఆటను మరింత బలంగా ఆడి ఎల్లో లేదా గ్రీన్ జోన్‌లోకి వెళ్లి ఉంటె బాగుండేది అన్నాడు . కానీ అతడు తన అవకాశాలను తానే దెబ్బతీసుకున్నాడని, తన వేలితో తన కంటినే పొడుచుకున్నట్లుగా పరిస్థితిని తెచ్చుకున్నాడని కామెంట్ చేసాడు . రోహిత్ ఆటలో ఆశించిన స్థాయిలో ప్రయత్నాలు పెట్టలేదని కౌశల్ విమర్శించాడు. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఇంట్లోకి వచ్చిన తర్వాత రోహిత్‌లో మార్పు వచ్చిందని చెప్పాడు. బయట నువ్వు తోపు, నువ్వే విన్నర్ అంటూ వారు ఇచ్చిన హింట్స్‌తో అతడిలో ఆత్మవిశ్వాసం పెరగాల్సింది పోయి అది ఓవర్ కాన్ఫిడెన్స్‌గా మారిందని అన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ కాస్తా అహంకారంగా మారి అతడి ఆటను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు.
కంటెస్టెంట్లకు ఆత్మవిశ్వాసం ఉండటం అవసరమే కానీ, అది అతివిశ్వాసంగా మారకూడదని కౌశల్ సూచించాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తలకెక్కితే చివరకు పాతాళానికి వెళ్లాల్సి వస్తుందన్నారు . రోహిత్ విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్పాడు. వైల్డ్ కార్డులు ఇచ్చిన హింట్స్‌తో తాను ఆట ఆడినా, ఆడకపోయినా ప్రేక్షకుల నుంచి ఓట్లు వస్తాయని రోహిత్ భావించినట్లు కనిపించిందని అన్నాడు. అదే భ్రమలో ఉండిపోయి తన ఆటపై దృష్టి పెట్టలేకపోయాడని విశ్లేషించాడు. ప్రేక్షకుల మద్దతు ఉందనే నమ్మకంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అతడికి నష్టం చేసిందని అభిప్రాయపడ్డాడు.
ఇక రోహిత్ ఎలిమినేషన్ సమయంలో త్రిగుణ్ వ్యవహరించిన తీరుపై కూడా కౌశల్ స్పందించాడు. రోహిత్ తన దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడని, అయితే త్రిగుణ్ దాన్ని తిరస్కరించిన తీరు తనకు నచ్చలేదని చెప్పాడు. ఈ విషయంలో త్రిగుణ్ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అతడు కూడా ఓవర్ కాన్ఫిడెంట్‌గా మారకూడదని హెచ్చరించాడు. రోహిత్ తన ఆటను సరిగ్గా ఆడి ఉంటే ప్రేక్షకుల ఓట్లతో టాప్ 2లో నిలిచే అవకాశం ఉండేదని, చివరకు టైటిల్ కూడా గెలుచుకునేవాడని కౌశల్ అన్నాడు.




.webp)

