.webp)
బుల్లితెర మీద రోహిణి అంటే చాలు నవ్వులు కేరాఫ్ అడ్రెస్ గా చెప్తారు. ఎందుకంటే ఆమె కామెడీ టైమింగ్ అలా ఉంటుంది మరి. జబర్దస్త్ నవ్వించిన, సేవ్ ది టైగర్స్ లో పంచులు పేల్చినా, ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో శ్రీముఖితో పోటాపోటీగా మాట్లాడినా అదంతా రోహిణికి సాధ్యం. అలాంటి రోహిణి రీసెంట్ గా ఒక రీల్ చేసింది. ప్లేన్ సిల్క్ ఎల్లో కలర్ శారీలో కనిపించేసరికి నెటిజన్స్ అంతా సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్నా "ఏందయ్యా సామే " అనే సాంగ్ కి రోహిణి ఈ రీల్ చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక ఒక నెటిజన్ ఐతే "వావ్ సూపర్ జూనియర్ భానుప్రియలో సో క్యూట్ అండ్ హాట్ గా ఉన్నావ్ " అంటూ కామెంట్ చేశారు. ఇంకో నెటిజన్ ఐతే "నాకు హీరోయిన్ రాధికలా అనిపిస్తున్నారు." అంటూ కామెంట్ చేశారు. "రోహిణి అక్క రొమాంటిక్ గా చేంజ్ అయ్యింది. ఏంటక్కా పెళ్లి చేసుకుంటున్నావా చెప్పక్క " అంటున్నారు. ఇంకో నెటిజన్ ఐతే "మిస్ వరల్డ్ కూడా మా అక్కకు సాటి రారు " అన్నారు. "రష్మిక ప్లేస్ లో నిన్ను పెట్టాల్సింది అక్క" అక్కా నువ్వు సూపర్ లేడీ డాన్ వి. "అక్క నీ లైఫ్ లోకి ఒక్క సూర్యుడు వచ్చి నిండు చంద్రుడిని కనుకగా తీసుకురావాలి" అంటూ రకరకాల కామెంట్స్ చేశారు. అలాగే వితిక సేరు, ఫైమా, జ్యోతక్క, పాగల్ పవిత్ర, అదితి భావరాజు వీరంతా కూడా స్వీటీ, క్యూటీ బాగున్నావ్ అంటూ రెడ్ ఇమేజెస్ తో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు.




.webp)
.webp)
